ఇదే జీవులకు స్వార్థమంటే. పితా దానవ రాజోమే భర్తామే రాక్షసేశ్వరః పుత్రోమే శక్ర నిర్ణేతా - ఇత్యేవం గర్వితా భృశమ్. నా తండ్రి దానవరాజు. నా భర్త త్రిలోకాధిపతి. కుమారు డింద్రజిత్తు. నాకేమని గర్వంతో ఉన్నానంటుంది. అసలు రహస్యమిప్పుడు బయటపడింది. ఇన్నాళ్లూ ఎవరెలా బాధపడ్డా ఏది ఏమయిపోయినా ఆ ఇల్లాలికి పట్టని దిందు కన్నమాట. తానూ తన కుటుంబము, తన వైభవము ఇదే. ఎంత నలుగురూ ఆడిపోసుకొంటున్నా ఇదే తనకు గొప్ప. ఆ పగటి కల ఇప్పుడొక్కసారి మంచుపొరలాగా విరిసిపోయింది. అందుకే హాస్వప్న స్సత్యమే వేదమ్ ఇది స్వప్నమా నిజమా అనివిస్తుపోతుంది. ఏమిటా స్వప్నమావిడ పాలిటికి. త్రైలోక్యవ సుభోక్తారం – జేతారం లోకపాలానాం క్షేప్తారం శంకరస్యచ - లోకక్షోభయితారంచ ఓజసాదృప్త వాక్యానాం - వక్తారం రిపుసన్నిధౌ హంతారం దానవేంద్రాణాం యక్షాణాంచ సహస్రశః నైక యజ్ఞవిలోస్తారం దర్మ వ్యవస్థ భేత్తారమ్ - మాయా స్రష్టారమాహవే - దేవాసుర నృకన్యానా మహర్తారం తతస్తతః అస్మాకం కామ భోగానాం దాతారం ఏవం ప్రభావం భక్తారం దృష్ట్వా రామేణ పాతితం- స్థిరాస్మియా దేహమిమం ధారయామి హతప్రియా.
చూడండి. మూడు లోకాలనూ క్షోభపెట్టి వాటి సంపద అంతా నీవే అనుభవిస్తూ శివుణ్ణి కూడా లెక్క చేయక ఎందరెందరో యక్ష రాక్షసులను మట్టుపెట్టి ఎన్నో -యజ్ఞయాగాలను ధ్వంసం చేసి ధర్మ వ్యవస్థనే అసలు రూపుమాపి దేవాసుర నరకన్యకల నెందరినో బలాత్కరించి తెచ్చి మాకందరికీ కోరిన కామసుఖాల నందిస్తూ ఇంత ప్రభావాన్ని చూపిన నీవు రామబాణంతో నేలరాలావంటే ఎంత దారుణం. ఇది చూచి కూడా నేనింకా బ్రతికున్నానంటే ఎంత సిగ్గుచేటు. అని దేవిరిస్తుంది. భర్త చేసిన పరదారాపహరణాదులన్నీ ఎంత ఘనంగా పొగడుతున్నదో చూడండావిడ. అవన్నీ చేసినందుకే ఆయన మహానుభావుడు. పడిపోయాడు గనుక ఇప్పుడు కన్నులు తెరచింది. లేకుంటే అదే లోకమని సర్వస్వమని ఆయనతోనే ఊరేగేది. అలా ఊరేగనివ్వకుండా దైవమిప్పుడు దెబ్బతీసింది తన్ను. కన్ను తెరపించింది. అందుకే అంటున్నది మరలా. ప్రవాదస్సత్య ఏవాయం త్వాంప్రతి ప్రాయశోనృప పతివ్రతానాం నాకస్మా - త్పతంత్య శ్రూణి భూతలే. లోకులనే ఈ మాట నిజమేనని ఇప్పుడనిపిస్తుం దావిడకు. పతివ్రతలు కంటనీరు పెడితే అది రాలి నేలమీద పడితే చేటు తెచ్చి
Page 293