దావిడ. అసురమాయ కాబట్టి ఏదో మొక్కుబడి తీర్చినట్టుగా ఎప్పుడో ఒక మాట చెప్పి అదుపు చేయలేక భర్త చెడిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ ఊరకుంది ఈవిడ. భయంతోనే గాని భక్తితో కాదని కదా పేర్కొన్నాము. అది అక్షరాలా సత్యం. ఎందుకంటే రాముడు పరమాత్మ అని తెలుసు తనకు. సీత పరాశక్తి మహాపతివ్రత అనీ తెలుసు. పతివ్రతా తేజమే చాలు భస్మం చేయగలదని తెలుసు భర్తను. అయినా అతడు బ్రహ్మవర ప్రభావ సంపన్నుడు గదా పైగా దేవర్షి యక్షరాక్షసాదుల నందరినీ జయించినవాడు గదా. త్రిలోకాలనూ గడగడ లాడించినవాడు గదా. ఒక్క మానవ మాత్రుడేమి చేయగలడులే అని బరవసా పడుతూ వచ్చింది. చివరకది కుళ్లు గుమ్మడికాయ అయ్యేసరికి అయ్యో పొరబాటుపడి తినే అని దిక్కుతోచక ఇక చేసేది ఏమీ లేక ఇప్పుడిన్ని బీదపలుకులు పలుకుతున్నది. ఇలా జరగబట్టి కాని ఇలా కాక రావణుడే దైవికంగా జయించి రాముడే ఓడిపోయి ఉంటే ఇన్ని ఆలోచన లావిడ మనసుకు వచ్చేవేకావు. అంతేకాదు. అనరాదుగాని అప్పుడా జగన్మాతను తన భర్త వశపరుచుకొని అశరణ్య అయిన ఆవిడను తనలాగే ఏలుకొన్నా చీమకుట్టినంత మాత్రం బాధ చెందేదీ కాదు. కథ అడ్డం తిరగబట్టి ఇప్పుడింత వలపోసుకొంటున్నది. అంతవరకూ మానవమాత్రుడైన రాముడిప్పుడు దేవుడై కనిపించాడు. అనాధ అయినా సీత ఇప్పుడు దేవతలాగా భాసించింది. భ్రాతృ వంచకుడై పోయాడనుకొన్న మరది విభీషణుడిపుడు మహాపుణ్యాత్ముడయి తోచాడు. అశక్త దౌర్జన్యమిది.
ఏమి ఇలాగే ఎందుకనుకోవా లావిడ. పాపం నిజంగానే అలాంటి స్వభావమున్నదేనేమో అంటే అలా కనపడటం లేదావిడ అనే అనంతర వాక్యాలు చూస్తే. అనంగ వశమాపన్న - స్వంతుమోహాన్న బుద్ధస్యే. నకులేన సరూపేణ నదాక్షిణ్యేన - మైథిలీ - మయాధికావా తుల్యావా. నీవు కామమోహితుడవై గమనించలేక పోయావుగాని ఆ సీత నాకంటే ఏమంత ఎక్కువదనా ? సమానురాలనా? ఆవిడ కోసం అలా వాపోయావు. కులశీలవయో రూపాది గుణాలలో నాకేమాత్రమూ సాటిరాదావిడ అంటుంది. చూడండి. అంతకుముందే ఆవిడ వసుధకు వసుధ - శ్రీకి శ్రీ అని కీర్తించింది. ఇప్పుడిలా తీసిపారేస్తున్నది. ఎంత అహంభావమో ఇది. అంతేకాదు. త్వం రామేణ కధం హతః కథం భయ మసం బుద్ధమ్ మానుషాదిదమాగతమ్. రాముడేమిటి ? నిన్ను చంపటమేమిటి ?
Page 291