#


Index



సీతా మందోదరులు

నీవప్పుడే దగ్ధమయి పోవలసింది. అయితే ప్రారబ్ధమింతవరకూ ఉండి ఇప్పుడు తీరిపోయింది. అవశ్యమేవ లభతే ఫలం పాపస్య కర్మణః ఘోరం పర్యాగతే కాలే. శుభకృత్ శుభమాప్నోతి పాపకృత్పా పమశ్నుతే. పాప ఫలం ఎప్పటికైనా అనుభవించి తీరవలసిందే మానవుడు. పుణ్యవంతుడు పుణ్యఫలమనుభవిస్తే పాపి పాప ఫలం అనుభవించక తప్పదు. చూడు. విభీషణః సుఖం ప్రాప్తః నీ తమ్ముడు పుణ్యాత్ముడు కాబట్టి సుఖపడ్డాడు. నీవో మరిదానికి నోచుకోలేదని వాపోతుంది.

  చూడండి. ఎన్ని విషయాలు తెలుసో ఆ మహాతల్లికి. ఎంత తెలిసి మాట్లాడుతున్నదో పూర్వాపరాలన్నీ తెలుసు ఆవిడకు. తెలియనిది కాదు. మరి తెలిసి కూడా ఎందుకలా బెల్లం కొట్టిన రాయిలాగా ఇన్నాళ్లూ నోరు మూసుకొని కూచుంది. భర్తకు నచ్చజెప్పి ఉండవచ్చు గదా. చెప్పే ఉంటుంది. ఉంటుంది కాదు. చెప్పానని తానే అంటుంది కూడా. క్రియ తామవిరోధశ్చ రాఘవేణేతి యన్మయా - ఉచ్య మానోన గృహాసి - తస్యేయం ప్యుష్టిరాగతా. రాముడితో మనకెందు కనవసరంగా విరోధం. మానుకోమని ఎంతగా నిన్ను హెచ్చరించినా నీవు నా మాట వినలేదు. దాని దారుణ పరిణామమే ఇదంతా నని ఆక్రందనలోనే ఆ సంగతి బయట పెడుతుంది. దీనిని బట్టి చూస్తే కథలో అంతకు ముందెప్పుడు మందోదరి నోరు తెరచి భర్తతో ఈ విషయం మాట్లాడి నట్టెక్కడా అంత ఎక్కువగా వర్ణించకపోయినా అడపాదడపా మాట్లాడినట్టే నచ్చ చెప్పటానికి యత్నించినట్టే మనమూహించుకోవచ్చు. మహర్షి కథా కథన శిల్ప సాగరంలో ఇదీ ఒక రమణీయ తరంగమే. భక్తితో కాకపోయినా ఏమి మూడుతుందో ననే భయంతోనైనా అని ఉంటుంది. సందేహంలేదు.

  మరి అంత చెప్పినా ఎందుకు వినలేదతడు. వినడతడు. అతడి స్వభావమే అలాంటిది. అసలే దానవుడు. అందులోనూ వరగర్వితుడు. ఎందుకు వింటాడెలా వింటాడు. ఈవిడ అయినా వినాలని విని బాగుపడాలని చెప్పినట్టు కనపడదు. అలాగైతే ఎప్పుడో ఒకప్పుడు చెప్పి ఊరుకోవటంకాదు. కాళ్లావేళ్లా పడి చెవి నిల్లు గట్టుకొని పోరాడేది. భర్తను నిష్టురమాడి అయినా బాగుచేయటానికి ప్రయత్నించేది. అలా నిష్టురమాడినది సీత. సమయం వచ్చిందంటే భర్తనైనా క్షమించలే దావిడ. నోరు పెట్టుకొని గట్టిగా దబాయించగలదు. అది అక్కడక్కడ చూడనే చూచాము మనం. దేవమాయ కాబట్టి భర్తను బాగుపరచటాని కాయన నదుపులో పెట్టగలిగిం

Page 290

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు