చూడండి. పై మాటలన్నీ గమనిస్తే మందోదరి ఎంత పూర్వాపరాలు తెలిసిన మనిషిగా కనిపిస్తుందో మనకు. ఖరదూషణాదుల వధ దగ్గరి నుంచీ తడవిందంటే అప్పటి కప్పటి నుంచే ఆమెకు రూఢ నన్నమాట. రాముడు మానవమాత్రుడు కాదని ఆయనతో విరోధం పెట్టుకోవటం తన భర్తకు క్షేమంకాదని. కనీసం హనుమంతుడు వచ్చి పట్టణాన్ని కాల్చిపోయిన తరువాతనైనా భర్త మేల్కొని ఉంటే బాగుండునని వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు వినాశానికే మాయా స్వరూపిణి అయిన సీత లంకలో ప్రవేశించిందని. అంత మాత్రమే కాదు. సీతా రాములిద్దరూ అలా కనిపిస్తున్నారేగాని వారెవరో కారు. ఆవిడ దృష్టిలో ప్రకృతి పురుషులే వ్యక్తమేష మహాయోగీ – పరమాత్మా సనాతనః అనాది మధ్య నిధనో మహతః పరమో మహాన్ తమసః పరమోధాతా శంఖ చక్రగదా ధరః శ్రీవత్స లక్ష్మానిత్య శ్రీః అక్షయ్యః శాశ్వతో ధ్రువః అనాది మధ్యలయుడూ శ్రీవత్సలాంఛనుడూ అయిన ఆ శ్రీమహావిష్ణువే రాముడంటే. అది జగదేకవీరుడైన తన భర్తను వధించటంలో తెలిసిపోయిందావిడకు. ఆ మహావిష్ణువే మానుషం వపురాస్థాయ - విష్ణుస్సత్య పరాక్రమః సర్వైః పరివృతోదేవై ర్వానత్వముపాగతైః సర్వలోకేశ్వరస్సా క్షాల్లోకానాం హితకామ్యయా సరాక్షస పరీవారం హతవాంస్త్వాం మహాద్యుతిః మానవుడి అవతారంలో వచ్చి ముక్కోటి దేవతలే వానరులుగా జన్మించి తనకు సహాయం చేయగా లోకేశ్వరుడు కాబట్టి లోకహితం కోసం సపరివారంగా రూపుమాపాడట తన భర్తను.
అంతేకాదు. రాముడు విష్ణువెప్పుడయ్యాడో సీత ఎవరిక. ఆ విష్ణు మాయ అయిన మహాలక్ష్మియే కావటానికి సందేహమేముంది. అదే అంటున్నది మందోదరి. అకస్మా చ్ఛాభి కామోసి సీతాం రాక్షస పుంగవ - ఐశ్వర్యస్య వినాశాయ దేహస్య స్వజనస్యచ ఉన్నట్టుండి నీ వినాశం కొని తెచ్చుకోవటానికే ఆ సీతాదేవిని కామించి తెచ్చావు. ఎవరని భావించావో ఆవిడను నీవు. అరుంధత్యా విశిష్టాంతాం రోహిణ్యాశ్చ అరుంధతీ రోహిణ్యాదులకంటే విశిష్ట చరిత్ర ఆవిడ. వసుధా యాశ్చ వసుధా. శ్రియః శ్రీమ్ భర్తృవత్సలామ్. భూదేవికి భూదేవి. శ్రీదేవికి శ్రీదేవి. అలాంటి దాన్ని మహాపతివ్రతను అరణ్యంలో ఒంటరిగా ఉన్న దాన్ని మోసం చేసి బలాత్కరించి తెచ్చావు. ఆవిడవల్ల ఏదో సుఖపడదామని కలలు గన్నావు. చివరకు కన్ను మూశావు. పతివ్రత తేజస్సే నిన్ను నిలువునా నీఱు చేసింది. తదైవ యన్న దగ్ధస్త్వమ్. అసలు
Page 289