కూడా తెలియనిది కాదు తనకు. అన్నిటికీ మెరుగు పెట్టినట్టతడు చివరకు జగన్మాతనే బలాత్కరించి తెచ్చాడని తెలుసు. తెచ్చి ఒక ఏడాది నిర్బంధంలో ఉంచాడని తెలుసు. అది కారణంగా ఎలాగూ ఎప్పటికైనా పరమాత్మ వచ్చి అతడికీ తనకు కూడా ముప్పు తెస్తాడనీ తెలుసు. అంతా తెలుసు తనకు తెలిసి కూడా మొదట మొదట అతడు చేసే పనులకు వేటికీ అడ్డు చెప్పలేదావిడ. దేవతలనెందరిని బాధించినా ఊరకున్నది. అతని సొంత అన్న సాధువర్తనుడు కుబేరుణ్ణి పారదోలినా మిన్నకున్నది. మహర్షుల నెందరిని హింసించినా మాట్లాడలేదు. గరుడ గంధర్వాది స్త్రీలనెందరిని బలాత్కరించి తెచ్చినా బదులాడలేదు. వారితోపాటు తానూ సుఖంగా కాపురం చేస్తూనే వచ్చింది. కడకు నందినలకూబరా నరణ్యాదుల వల్ల ఘోరమైన శాపాలు నెత్తికీ తెచ్చుకొన్నా హితం చెప్పి అతణ్ని మంచి దారికి తిప్పటానికి యత్నించలేదు. పోతే ఈ జగన్మాతను తెచ్చినప్పుడే మేల్కొన్నదావిడ. అప్పటి నుంచే అడపా దడపా అతనికి హితం చెప్పటానికి ప్రయత్నించింది. అదీ పాతిక భాగం భక్తితో అయితే ముప్పాతిక భాగం భయంతో
భయంతోనే ఒకటి రెండుమార్లు హెచ్చరించిందతజ్జీ. పోతే ఆవిడ మనకు బాగా దర్శనమిచ్చింది రావణ వధానంతరమే. అంతవరకూ మూసిన ముత్యంలాగా ఎక్కడ ఉందో ఏమో. రావణుడు చేస్తూ వచ్చిన ఘనకార్యాలావిడ కతడు చచ్చేదాకా తెలియదనుకోవాలా తెలుసుననుకోవాలా ? తెలియదనుకోవటాని కావిడ ఏమంత అమాయికురాలా కాదు. ఏ మాత్రమూ కాదు. కాదని చెప్పటానికావిడ అతని వధానంతరం యుద్ధభూమికి వచ్చి చేసిన విలాపవాక్యాలలోనే ఋజువవుతుంది మనకు. నను నామ మహాభాగ తవవై శ్రవణానుజ క్రుద్ధస్య ప్రముఖే స్థాతుం త్రస్యత్యపి పురందరః ఋషయశ్చ మహీదేవా గంధర్వాశ్చ యశస్వినః నను నామ తత ద్వేషాచ్ఛారణాశ్చ దిశోగతాః నాధా నీవు ప్రభావశాలివి. కోపించి చూస్తే నీ ఎదుట దేవేంద్రుడు కూడా నిలబడటానికి భయపడతాడు. ఎందరో మహర్షులు, గంధర్వులు, చారణులు, ఇలాంటి దేవయోనులంతా నీ ఢాకకు తట్టుకోలేక దిక్కులు పట్టిపోయారు. దీనిని బట్టి తన పెనిమిటి చేసిన ఆ కృత్యాలన్నీ అకృత్యాలుగా దావిడపాలిటి కవి చాలా గొప్ప పరాక్రమ చర్యలన్న మాట. అందుకే అతడు మొదటినుంచి ఏయే లోకాలమీద దండెత్తినా ఎవరెవరిని బాధించినా ఆవిడ కావంత
Page 287