ఎంత ఆశ ఉన్నా అది మోఘాశే. ఎంత కర్మ చేస్తున్నా అది మోఘకర్మే. ఎంత జ్ఞానమున్నా అది మోఘజ్ఞానమే నంటున్నది భగవద్గీత. కడకు విచేతసః తన చేతన కూడా పని చేయకుండా ఫలితమివ్వకుండా పాడయి పోవలసిందే. అలాగే అయింది కదా మందోదరి జీవితం. ఎంత పుణ్యవతి అయినా జ్ఞానవతి అయినా రాజస తామస శక్తుల నాశ్రయించిన నేరానికంత జీవితము విఫలమయి పోక తప్పలేదు.
అసలు రావణుణ్ణి వివాహ మాడటంలోనే ఆవిడ తన వివేకాన్ని కోలుపోయింది. సీతా మందోదరులిద్దరూ తమ పాటికి తాము వరించలేదు తమ భర్తలను. తమ తండ్రుల అభిమతం మేరకే చేసుకొన్నారు కాని ఇద్దరికీ వారాఏమంటే ఇద్దరూ మౌనంగానే పరిగ్రహించినా అగ్ని సాక్షికంగానే అయినా రాముడంతకు ముందుచేసిన గురు శుశ్రూషాదులను, పరోపకారులను ధనుర్భంగం చేసి చూపిన బలపరాక్రమాది గుణగణాలను చూచి చెట్టబట్టిందాయన నమ్మవారు. ఈ అమ్మవారో ఆ రావణుడి గుణసంపత్తి కించిత్తు కూడా అంతకు పూర్వమేమిటో తనకు తెలియదు. అతడు విశ్రవనుని కుమారుడు-పులస్త్యుని మనుమడు బ్రహ్మ వంశోద్భవుడు అని ఈ వంశ ప్రవర ఒక్కటే తనకు తెలిసింది. అదీ అతడే కరువు పెడితే తెలిసిందే. అతడేదో చెప్పి తన్ను చేసుకోదలచాడు. తండ్రి ఏదో సాకు పెట్టి అతడి చేతిలో పెట్టదలచాడు. అతే తరువాత దాని పరిణామమెంత దారుణంగా ఉండబోతుందో ఆవిడ కంతు చిక్కింది కాదు. ప్రకృతిం మోహినీం శ్రితః మోహిని అయిన ప్రకృతికి లోనయినప్పుడది అలాగే ఉంటుంది. ఒక పెద్ద మైకంలో పడదోసి ఏదీ మంచి చెడ్డ ఆలోచించనివ్వదు. ఆలోచనకెప్పుడైనా తట్టినా అది ఆచరించనివ్వదు.
జీవితమంతా అలాగే సాగిపోయిందని చెప్పాము మందోదరికి. చూడండి. రావణుణ్ణి ఏ ముహూర్తంలో చేసుకున్నదో ఏమో. అంతే ఆ తరువాత అతనితో ఎంతో కాలం కాపురం చేసింది. బిడ్డలను కన్నది. ఆ బిడ్డలేమి సామన్యులా ? ఒక డింద్రజిత్తు. ఒక్క డక్షయుడు. ఒక్కొక్క డొక్కొక్క లోకమేలే మహావీరులు. మరి విభీషణుడిలాంటి సాత్త్వికుడైన మరది వ్యవహారం చూచింది. అతడి భార్య తన తోడికోడలు సరమ ఎంత సరల స్వభావురాలో తెలుసు నావిడకు. మరి అంత దీర్ఘమైన తన పంత్య జీవితంలోనూ తన భర్త ఎన్నెన్ని ఘనకార్యాలు చేశాడో చేస్తున్నాడో కూడా చెవులారా వింటూ కండ్లార చూస్తూనే ఉన్నది. వాటి పరిణామమేదో
Page 286