#


Index



సీతా మందోదరులు

లనిపించుకొన్నవారు అయిదుగురున్నారు. వారే పంచకన్యలు. అహల్యా ద్రౌపదీ తారా తారా మందోదరీ తథా అని ఒక ఆభాణకం కూడా ప్రచారంలో ఉంది. ఇందులో మిగతా నలుగురూ బహుభర్తృకలనే విషయం మనకు తెలుసు. పోతే మందోదరి విషయంలోనే సందేహం మనకు రెండవ భర్త ఎవరా అని అతడు వాలేనని చెబుతారు. అవునో కాదో గాని అయినా కావచ్చుననే ఊహకు కొంత అవకాశమిస్తుంది మయుడి మాట మనకు. మాయావి- దుందుభులు మయుడి కుమారులు. వారిని మట్టు బెట్టిన బలశాలి వాలి. అతడు బలశాలేగాక పర స్త్రీలోలుడు కూడా. మాయావి దుందుభుల చెల్లెలే ఈ మందోదరి. పైగా సౌందర్యానికి పెట్టిన పేరు. అలాంటి సౌందర్యనిధిని చేసుకోక ఉపేక్షిస్తాడా ? మహావీరులైన మయపుత్రులనే వధించినవాలికి ముసలివగ్గు మయుడొక లెక్కా, తలచుకుంటే వాడినొక ప్రక్కకు నెట్టి అసహాయ అయిన ఆ కన్యకను పట్టి క్రీడించలేడా ? బహుశా అలా కొంతకాలం క్రీడించి తన వాంఛ తీరగానే వదలివేశాడో ఏమో ? కన్యాపి తృత్వం దుఃఖంహి సర్వేషామ్ మాసకాం క్షిణాం కన్యాహిద్వేకు లేనిత్యం సంశయే స్థాప్యతిష్ఠతి కన్య అనేది అటు పుట్టినిల్లు ఇటు మెట్టినిల్లు రెంటికీ ముప్పు తెచ్చి పెట్టినా పెట్టవచ్చు. కన్యా పితృత్వమనేది మహా కష్టం. పరువు ప్రతిష్ఠలతో బ్రతికేవాడు ఎవరికో ఒకరికి గుణవంతుడికిచ్చి చేయటమే మంచిది. భర్తా రమనయా సార్థ మస్యాః ప్రాప్తోస్మి మార్గితుమ్. అందుకే ఈవిడకు తగిన భర్త ఎవరా అని వెతుకుతూ వస్తున్నానంటాడు. ఇది అతని మనసులోని ఆరాటాన్ని తద్వారా అంతకుముందు జరిగిన సంఘటనన ధ్వనింపజేసినా చేయవచ్చు. మరి రావణుడు బ్రహ్మ వంశోద్భవుడని తెలియగానే ఇక అటూ ఇటూ చూడక ఎగిరి గంతేసి పిల్లనిస్తాడు. బహుశా ఆ వానరముఖుడి కంటే ఈ దశముఖుడే అందగాడు, అనురూపుడు అని భావించాడు కాబోలు.

  ఈ కథ అవాల్మీకం. కేవలం లౌకికమే అయినా కథకాదు మనకు ప్రధానం. కథ అబద్ధమే అయినా అందులో దాగి ఉన్న అంతరార్థ మాలోచిస్తే మందోదరి అంటే ఎవరో ఏమిటో మనకు పట్టి ఇస్తున్నది. మొదట ఒక వానరుణ్ణి మరలా ఒక దానవుణ్ణి ఆశ్రయించినదే మందోదరి. వానరుడంటే రజోగుణం దానవుడంటే తమోగుణ మనుకొంటే రాజసతామస గుణాలతో కూడిందే అసురమాయ. రాక్షసీమా సురీంచైవ - ప్రకృతిం మోహినీంశ్రితః అలాంటి అసుర గుణ ప్రకృతి నాశ్రయిస్తే

Page 285

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు