అక్కడ కాపురమున్నది. ఆవిడే గదా హనుమదాది వానరుల కప్పుడాతిధ్యం చేసింది కాగా ఆ మయుడివల్ల ఆ హేమకు జన్మించారు ఇద్దరు కుమారరత్నాలు. ఒకడు మాయావి. మరొకడు దుందుభి. వారి తరువాత జన్మించిన మూడవ సంతానమే ఈ మందోదరి. అన్నలిద్దరూ జగజెట్లు. ఇద్దరూ బలశాలి అయిన వాలిమీద చేయి చేసుకొని అతని చేతిలో చిత్తుగా ఓడిపోయినవారే. అతనిచేత చివరకు నిహతులైన వారే. ఆ దుందుభి కళేబరాన్నే శ్రీరాముడప్పుడు గోటమీటింది. ఇంత ఉంది వీరి చరిత్ర. ఇలాంటి సోదరులకు సోదరిగా అలాంటి పైలాపచ్చీసు తల్లిదండ్రులకు ఏకైక పుత్రికగా జన్మించింది ఈ మందోదరి. మరి ఈవిడకు మాత్రం ఆ వంశ లక్షణాలెక్కడికి పోతాయి. కొంచెమైనా సంక్రమించి తీరవలసిందే. ఆ లక్షణమేదోగాదు. అసురమైన బుద్ధే. దాని ఎడల వ్యామోహమే.
ఆ వ్యామోహానికి తగినట్టే పనిచేసిందా విధి విలాసం కూడా. మయుడు తన కూతురు మందోదరిని వెంట బెట్టుకొని అడవిలో తిరుగుతూ అదే సమయాని కక్కడికి వేటకు వచ్చిన రావణుడి కెదరుపడతాడు. వాడెవరయ్యా నీవీ మృగశాబాక్షితో కలిసి తిరుగుతున్నావేమిటి ఎందుకని ప్రశ్నిస్తాడు. వాడు తన కథ అంతా చెప్పి ఈవిడ నాకూతురు. ఈవిడ నొక అయ్య చేతిలో పెట్టి ఋణవిముక్తుణ్ణి కావాలని ఉంది. నీవెవరు నాయనా నీకు గోత్రాదులేమిటని ప్రశ్నిస్తాడు. అతడు తనవంశ చరిత్ర అంతా చెప్పగానే ఓహో నీవు రావణుడవా ? బ్రహ్మవంశోద్భవుడవా ? అయితే నీవే నా కుమార్తెకు తగినవాడవని అప్పుడే అగ్నిసాక్షికంగా అతనికిచ్చి పెండ్లి చేస్తాడు. అమోఘమైన ఒక మహాశక్తిని కూడా ఇచ్చిపోతాడు. అప్పటినుంచీ ఆవిడ ఆ భర్త కనువ్రతగానే జీవితం గడిపింది. అనువ్రతే పతివ్రతే మందోదరి. సందేహం లేదు. కాని ఏమి ప్రయోజనం. అసురుని కనువ్రత. అసుర పతివ్రత. కనుక అసురమే గాని ఆ జీవితం భాసురం కానేరదు.
వాల్మీకి రామాయణంలో లేదు గాని అసలొక మాట ఉంది లోకంలో. మందోదరి మొదట వాలిని చేపట్టిందని. అతనివల్ల కన్నబిడ్డడే అంగదుడని. ఆ తరువాత అతణ్ణి వదలి మరలా ఈ అసురేంద్రుడడికి పట్టమహిషి అయిందని. రెండుమార్లు పెండ్లాడిన ఆవిడ పాతివ్రత్యానికి లోపం లేదని కూడా చెబుతారు. ఇలా రెండు మూడుమార్లు ఇద్దరు ముగ్గురు భర్తలను స్వీకరించి పతివ్రత
Page 284