అప్పుడు మనబోటి భూలోకవాసుల వ్యవహారంలాంటిదే ఆ దేవి వ్యవహారమని తోస్తుంది మనకు. దానితో ఏమిటా ఆవిడ ఇలా అన్నదలా చేసిందని ఆశ్చర్య పడతాము. అలాకాక ఆ మాటల వెనుకా ఆ చేష్టల వెనుకా దాగివున్న ఆ జగన్మోహిని దివ్యమంగళ స్వరూపాన్నే దర్శించగలిగితే పరస్పర విరుద్ధంగా తోచే అన్నిభావాలు అద్భుతంగా సమన్వయమవుతాయి. లేకున్నా కొంప మునిగిందేమిటి? శివాదిక్షిత్యంతమ ఖండంగా వ్యాపించిన షట్రింశత్తత్త్వాలు ఆవిడ లీలావైభవజాలమే గదా. హ్రీ శ్రీధీ భయ లజ్జాసాధ్వసకామ క్రోధలో భాసూయా మాత్సర్యాగ్ర హనుగ్రహాది వృత్తులన్నీ ఆ మహాదేవి వేసే ఎత్తులేగదా ? హనుమంతు డావిడను మొదటిసారిగా దర్శించినప్పుడా ఉపాసకుడి కావిడ మూర్తి అలాగే కదా దర్శనమిచ్చింది. సోపసర్గామ్ యథా సిద్ధిమ్ - అనటంలో ఆవిడ సిద్ధి అని బుద్ధిం సకల షామివ అనటంలో ఆవిడ బుద్ధి అని – విద్యాం ప్రశిధిలామివ అనటంలో ఆవిడే కీర్తి అని భంగ్యంతరంగా సూచితమవుతూనే ఉంది. ఇది మహాబుద్ధిర్మహా సిద్ధిర్మహావిద్యా అనే దేవీ నామధ్వనులను మన మనో మృదంగం మీద ఎలా పలికిస్తున్నవో చూడండి. అంతేగాక దేశకాలాది భౌతిక పదార్ధాలు మొదలుకొని ధృతిస్మృత్యాదులైన అభౌతిక భావాలవరకు వివిధోపమానాలతో వర్ణించటంలో ఆదేవి స్థూల సూక్ష్మావ్యక్తాత్మకమైన వైభవాన్నంతా మన మనోనేత్రానికి గోచరింపజేసినట్టే అయింది. అది స్వరూపదశలో లేకున్నా విభూతి దశలో కావలసి వస్తుంది. స్వరూపదశ శ్రీ అయితే విభూతిగా మారినప్పుడు భూ అయింది. భూ అయింది గనుకను తన భూజీవితాని కనుగుణంగా ఏయే దశలలో ఏయే భావాలు ప్రదర్శించాలో అవి లోకానికి ప్రదర్శించి అంతర్ధానమయి పోయింది. రాముడికే కాదు ఆనాటి సాకేతవాసులకే గాదు. ఈనాటి మనబోటి మానవులకూ ఆవిడ మర్త్యరూపమే చూచి అదే వాస్తవమని భ్రాంతి చెందక అమర్త్యమైన ఆమె దివ్యస్వరూపం ధ్యానిస్తే రాముడితో ఆ సాకేతవాసులతో పాటు మనము జ్ఞానసరయువులో మునిగి పరిశుద్ధులమైపోయి దర్శించగల మామె పరిశుద్ధ పరిపూర్ణ తత్త్వాన్ని.
సీతామాత వ్యవహారమయింది. ఇక మనకు మిగిలింది మందోదరి వ్యవహారం. సీత దేవమాయ అయితే ఈవిడ దానవ మాయ అని పేర్కొన్నాము. చూడబోతే రెండూ ఒకదాని కొకటి ప్రతీప శక్తులు. రెండూ మాయలే అయినా ఈ రెండు
Page 282