#


Index



సీతా మందోదరులు

వచ్చారు. అందుకే నా అసలైన శ్రీతత్త్వమేమిటో మీకంతు పట్టలేదు. మీ దృష్టికి తగినట్టే నేను భూజాతనయి చివరకు భూమాత ఒడిలోకే వెళ్లి కూర్చుంటున్నాను. అదే నా తత్త్వమనుకొంటే దానితోనే తృప్తి పడండి. మీరిక ఎవరెంత వాపోయినా నేను మీకు దర్శనమివ్వనని లోకానికంతా ఘాటుగా చాటి చెప్పినట్టయింది అమ్మవారి వ్యవహారం. లోకమంటే ఏమిటా లోకం. దేవదానవ మానవలోకాలు మూడూ. అవి మూడు త్రిగుణాలకు సంకేతమే గదా. అప్పటికి త్రిగుణాతీత అయిన పరాశక్తి స్వరూపం త్రిగుణాత్మక లోకానికి బోధపడలేదని అందుకే అది అజ్ఞాతంగానే వచ్చి అజ్ఞాతంగానే నిష్క్రమించిందని భావం.

  క్షేత్ర లక్ష్మిగా మొదట సాక్షాత్కరించింది ఆ మహాశక్తి రాజర్షి అయిన జనకుని నేత్రాలకు. శ్రీరామచంద్రుణ్ణి అగ్ని సాక్షిగా వరించి వరలక్ష్మి అయింది. ఆయన గారితో వచ్చి ఇక్ష్వాకుల ఇంట ప్రవేశించి వారి పాలిటి గృహలక్ష్మి అయింది. పట్టభంగమయిన పెనిమిటితో అరణ్య సీమలలో వసించి వనలక్ష్మి అయింది. రావణుడి రాజ్యానికి తరలిపోయి మధ్యలో అదృష్టలక్ష్మి అయింది. మరలా యుద్ధంలో తన భర్తకు విజయం చేకూర్చి జయలక్ష్మి అయి ఆయన గారితో సాకేతానికి వచ్చి పట్టాభిషేకం చేసుకొని రాజ్యలక్ష్మి అనిపించుకొంది. పిమ్మట మహర్షి ఆశ్రమం చేరి అక్కడ సంతానవతియై సంతాన లక్ష్మి అని పేరువడసింది. చివరకన్ని భూమికలు పరిత్యజించి సహజమైన రూపంతో ప్రకాశించి శ్రీమహాలక్ష్మి అయిందా మహాతల్లి. ఆదిలో మహాలక్ష్మి అంతంలోనూ మహాలక్ష్మే అమ్మ. ఇవన్నీ మధ్యలో సంక్రమించిన భూమికలే. ఎందుకీ భూమికలు. చెప్పారు గదా దేవకార్య సముద్యతా అని. దుష్టశిక్షణ శిష్టరక్షణ. ఏతన్మూలంగా ధర్మస్థాపన. అది తన నాథునికి తోడ్పడి తద్వారా ఆ కార్యాన్ని సాధించటానికే అన్ని వేషాలు వేసిందమ్మవారు. అన్ని భావాలు ప్రదర్శించింది. ఇది మంచి - ఇది చెడ్డ అని లేదు. అన్నీ ఆవిడ పాత్రలే అభినయాలే.

  అభినయమంటే అది అతిలోకం. మన విమర్శకే అందనిదది. ఎటు చెప్పటానికి వీలుపడని పరస్పర విరుద్ధమైన భావాలు ప్రదర్శిస్తుందా మాత. పరమ వినయంగా అమాయికగా మితభాషిణిగా కనిపిస్తుందొకప్పుడు. ఒకప్పుడు స్త్రియం పురుష విగ్రహమని, లఘునేవ మనుష్యేణ స్త్రీత్వమేవ పురస్కృతమని భర్తనే దుయ్యపడుతుంది. క్షత్రియుడైన వాడార్త రక్షణకోసం ధనుర్బాణాలు ధరించవలసే ఉంటుందని భర్తకు

Page 280

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు