#


Index



సీతా మందోదరులు

అనిపించుకొన్న తన్ను అయోధ్యలో ఒకడెవడో కాని మాట అనటమేమిటి? అది వేదవచనం లాగా పాటించి అన్నీ తెలిసిన రాముడు తన్ను వదలి వేయటమేమిటి? ఇదీ తన ప్రణాళికలో ఒక భాగమే. లక్ష్మణుడి ద్వారా రాముడికి పంపిన సందేశంలో ఆవిడ అన్న మాటలు వింటే చాలు ఆవిడ సంకల్పమేమిటో తెలుస్తుంది. జానాసిచయధాశుద్ధా సీతా రామా నీకు తెలుసు. నేను శుద్ధ స్వభావనని. యచ్చ తే వచనీయం స్యాత్- మయా తత్పరి హర్తవ్యమ్. నీకు వచ్చిన అపవాదం తొలగించటం నా ధర్మం. పతిర్హి దేవతానార్యాః పతియే సతులకు దైవతం - నావల్ల నీకు అపయశం రాకూడదు. అందుకోసమీ శరీరమైనా పరిత్యజించగలను. లోకాపవాదం రాజులకు రాగూడదని వస్తే అది వారి కీర్తికి భంగకరమని అది లేకుండా రాజ్యం చేయటమే ఉత్తమ క్షత్రియుల కర్తవ్యమని మరి ఉత్తమ కులాంగనలకు పతియే దైవత్వమని వారి కపకీర్తి రాకుండా వస్తే అందుకోసం తామెంతైనా త్యాగం చేయవలసి ఉంటుందని మానవలోకానికి చాటటమే ఈ మాటలలోని ఆంతర్యం. మరేదీగాదు.

  పోతే ఇక ఆమె ప్రణాళికలో కట్టకడపటి మజిలీ ఆమెకు భర్త పెట్టిన పరీక్ష. భర్తకాదు. భర్తద్వారా ప్రజలు పెట్టినది. ప్రజలెవరు ఆమెకు పరీక్ష పెట్టటానికి. జగన్మాత కావిడకు పరగృహ వాసమేమిటి ? కళంకమేమిటి ? అది ఒక నెపంగా రాముడు పరిత్యజించటమేమిటి ? పరిత్యజించి పుత్రవతి అయిన ఆవిడను మరలా పరిగ్రహించటానికి ప్రజలకే సంజాయిషీ చెప్పుకోమని ఆమె నాదేశించటమేమిటి? అసలావిడ అయోనిజ. చిదగ్నికుండ సంజాత అయినా మృదగ్ని కుండ జాత అయి కనిపించింది. మధ్యలో భర్త అనుమానిస్తే చిదగ్ని కుండంలోనే ప్రవేశించి చూపింది తన మహత్త్వాన్ని. అంత జరిగినా ఆ మహాశక్తి మాహాత్మ్యాన్ని గుర్తించని లోకానికి మరలా తాను చిదగ్నిలో ప్రవేశించి చూపాలా ? అక్కరలేదు. ఈ మృత్పిండ బుద్ధులకు మృదగ్ని రూపమే చాలుననుకొంది. అందుకే జనంవైపు చూడలేదు. రాముడివైపు చూడలేదు. ఎవరివైపు కన్నెత్తి చూడలేదు. జగన్మాత కడకంటి చూడ్కికి కూడా పాత్రులు కారు ఇతరులెవ్వరూ. మొదట భూమినుంచి వచ్చిన విషయం మీకెవ్వరికీ ఎలా అంతు పట్టలేదో అలాగే ఇప్పుడూ ఆ భూమిలోకే వెళ్లుతున్న రహస్యం కూడా మీకంతు పట్టదన్నట్టు భూదేవి గర్భంలోనే ప్రవేశించి అదృశ్యమయింది. ఏమిటి దీని భావం. మీరు నా భూతత్త్వాన్నే చూచి నా జీవితమంతా భౌమంగానే భావిస్తూ

Page 279

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు