అయితే ఈ సన్నివేశం నిజంగా జరగలేదా అని ప్రశ్న వస్తుంది. జరగలేదనే చెబుతారు గోవిందరాజాది వ్యాఖ్యాతలు. “సర్వమేతత్ రామాయణే ప్రక్షిప్తమ్ అథవా వాల్మీకి శిష్యేణ కేనచి త్ప్రణీతమ్ భవిష్యతి" అని కంఠోక్తిగా చెప్పాడాయన. మహర్షి గొప్పతనాన్ని చాటటానికి లోకుల హృదయాల్లో చక్కగా నాటటానికి చేసిన చమత్కార కల్పన అయి ఉండవచ్చు. వాల్మీకి కిరాతజన్మ వృత్తాంతమెలాంటిదో అలాంటిదే ఇది. హేయమైన తన గతజీవితాన్ని ప్రకృష్టమైన జ్ఞానంతో పునీతం చేసుకొన్న మహర్షి మరలా అలాంటి హేయప్రవర్తనమే మరొకడిలో చూచినప్పుడెలా ప్రతిస్పందిస్తాడో సహృదయులకు కన్నులకు కట్టినట్టు ప్రదర్శించటమే దీని లక్ష్యం. ఈ దృష్టితోనే ఇది లోకంలో ప్రచారమవుతూ వచ్చింది. ఎంతకాలం నుంచి చెలామణిలో ఉందో ఏమోమరి. కాళిదాసాదులైన ప్రాచీన మహాకవులు కూడా ఈ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. "తామభ్యగచ్చ ద్రుదితానుసారీ-కవిః కుశేధ్మా-హరణాయ యాతః నిషాదవిద్దాం డజదర్శనోత్థః శ్లోకత్వ మాపద్యత యస్యశోకః” అని రఘువంశంలో ఆయన అన్న మాట. ఇలాంటి మాటే తరువాత భవభూతిలాంటి కవులు కూడా లోకానికి చాటారు. చూడబోతే ఆ కాలానికే ఈ ఆభాణకం లోకంలో బాగా చెలామణి అయి ఉంటుంది. కర్ణాకర్ణిగా తాము వింటూ వచ్చిన ఆ విషయాన్నే వీరందరూ వాకొంటూ వచ్చారు. అంతేగాని దీనికి ప్రామాణ్యమంటూ ఏదీలేదు. ఏదైనా ఉన్నదంటే అది రామాయణావతారికలో ఉన్న సందర్భమే. అది కాలాంతరంలో జరిగిన ప్రక్షిప్తమని వ్యాఖ్యాతలే చెబుతున్నారు.
కాకపోయినా దీని ప్రామాణ్యా ప్రామాణ్య విచారం మనకంత ఆవశ్యకం కాదు. ఇది వాస్తవమైతే కావచ్చు. కాకపోవచ్చు. వాస్తవమైనా కాకున్నా సాంకేతికంగా చెప్పుకొనే అర్ధం మనకెంతైనా ఉపదేశదాయకం. అభ్యుదయకారకం. అంతేకాదు. మనాక్కావ్యార్థ సూచనమని నాటకాల్లో చెప్పినట్టు నాటకీయమైన ఈ రామాయణ కావ్యార్థాన్నంతటినీ ఇది పరమాద్భుతంగా సూచిస్తున్నది. ఏమిటా సూచన అంటే అనుచితంగా కామపురుషార్ధాన్ని సేవిస్తే కలిగే అనర్థం. అది ఒక్క రావణుడి విషయంలోనే గాదు. కామమోహితుడొక రావణుడే ఏమి. అంతకు ముందు కిష్కింధాధిపతి అయిన వాలి కూడా కామమోహితుడే. ఆ మాటకు వస్తే అయోధ్యాధిపతి దశరథుడేమి తక్కువా ? అతడూ కైకేయీ కామమోహితుడే. ముగ్గురూ
Page 28