దానవులెప్పుడే వేషంలో వచ్చి తమ్ము మోసగించినా మోసగించవచ్చునని. అంతేకాక లక్ష్మణుడు కూడా దాన్ని చూచి ముందుగానే హెచ్చరించాడు. మృగోహ్యేవం విధోరత్న విచిత్రో నాస్తిరాఘవ - మాయై షాహిన సంశయః తమేవైత మహం మన్యే మారీచం రాక్షసం మృగమ్. అన్నయా వదినె ముచ్చటపడుతున్నదే గాని ఇది నిజమైన మృగం కాదు. ఇలాంటి రత్నమయమైన మాయా మృగమెక్కడైనా ఉంటుందా ? ఇదంతా దానవమాయ. నాకు జూడమారీచుడే ఈ మాయాలేడి రూపంలో వచ్చి ఉంటాడు. చూడండి. లక్ష్మణుడికి తెలిసినపాటి తెలియదా సీతా రాములకు. అన్నీ తెలిసే దాన్ని పట్టి తెమ్మని నిర్బంధిస్తుంది రాముణ్ణి. పైగా సౌమిత్రిం ప్రతివార్య శుచిస్మితా అంటాడు వాల్మీకి. లక్ష్మణుడింకా అనబోతుంటే ఇక చాలు ఊరుకోమని చెప్పి చిరునవ్వుతో భర్తవైపు తిరిగి ఎలాగైనా సరే. దీని చర్మ సౌందర్యం చూస్తే నాకు చాలా మోజుగా ఉంది. స్త్రీణామస దృశం నాలాంటి స్త్రీ ఇలాంటి కోరిక కోరట మనుచితమని తెలుసు. అయినా దీనిపై వ్యామోహమలాంటిది. ఒకవేళ ప్రాణంతో అది పట్టుపడకపోతే చంపి అయినా తీసుకురా. దాని చర్మం ఒలిపించి తీసుకెడదాము. అత్తలకందరికీ దాన్ని చూపి సంతోషపెడతాను. దానినే ఆసనంగా చేసుకొని కూర్చుంటానని బ్రతిమాలుతుంది. చూడండి. ఏమి కోరిక ఇది. ఎలాంటి చాపల్యం. అన్నీ తెలిసికూడా ఇలాంటి కోరిక కోరటమేమిటి పసిపిల్లలాగా. అదే ఆ దేవి చమత్కారం.
తెలిసే చూపుతున్నది చాపల్యం. భర్తను బలవంతపెడుతున్నది పట్టి తెమ్మని. పెట్టకపోతే ఆయన దాని వెంబడిపోడు. పోతేగాని ప్రాణాలు తీయడు. తీస్తేగాని వాడు రామాలక్ష్మణా అని కేకలు పెట్టడు. పెడితే ఆ నెంపతో తాను లక్ష్మణుణ్ణి కూడా వెంటనే సాగనంపి ఒంటిగా ఉండవచ్చు. ఉంటే ఎలాగూ రావణుడు రాకమానడు. తన్ను వాడు కొనిపోక మానడు. అప్పుడుగాని కథ రసకందాయంలో పడదు. ఇది ఆ మహాతల్లి ప్రణాళిక. దాని కనుగుణంగా రామ లక్ష్మణులను వాడుకొన్నది. లేకుంటే ఆవిడ మారాము పెట్టిందో లేదో తగుదునమ్మా అని వెంటనే ఆయన బయలుదేరట మేమిటి. పైగా లక్ష్మణా చూడు ఇలాంటి మృగం భూమి మీద నేమిటి. నందనంలో చైత్ర రథంలో కూడా దొరకదు మనకు. కస్యరూప మిదం దృష్ట్వా నమనో విస్మయం ప్రజేత్ ఇలాంటి హరిణ మెవరి మనస్సును
Page 276