#


Index

సీతా మందోదరులు

ఇంకొకటి దాని ఛాయ. ఈ ఛాయలో ఈ ప్రతిబింబంలో కనిపించే ప్రతి భావంలో ప్రతిమాటలో ప్రతి కదలికలో మనం చూడవలసింది ఈ ప్రతిబింబాన్ని కాదు. దీని ద్వారా ఆ బింబాన్ని, దాని ఆదేశానుసారం దాని సంకల్పసూత్రానికి కట్టుబడి నడిచిందే బాహ్యమైన కథా జీవితమంతా ఆ రెండింటి సామరస్యమెలాంటిదో ఆంతర దృష్టితో వాల్మీకి దర్శించి ఎలా సృష్టించాడో మనమూ ఆ సృష్టినంతా దృష్టిపెట్టుకొనే దర్శిద్దాము.

  అసలు సీత ఎప్పుడు జన్మించిందో ఎలా జన్మించిందో మొట్టమొదట తెలిసింది మనకు విశ్వామిత్ర జనక సంవాదంలో. దేవయజనం కోసం భూమి దున్నుతుంటే హల ముఖం నుంచి ఆవిర్భవించిదంటారు జనకుడు. స్త్రీ పుంస వ్యవహారం లేకుండా ఎవరికీ ముందుగా ఎలాంటి ఆచూకీ ఇవ్వకుండా ఇలా అయోనిజగా సాక్షాత్కరించట మేమిటి ? అందులోనే తెలుస్తున్న దావిడ పరదేవత అని. అది అప్పుడే గ్రహించాడా మహాజ్ఞాని జనకుడు. అలాంటి మహాశక్తిని భరించగల మహాపురుషుడొక్క నారాయణుడే నని భావించాడు. మరి ఆయనను రప్పించాలంటే ఏమిటి మార్గం. ఆలోచించాడు. విష్ణువుకు సరిజోడు శివుడు. తనదగ్గర తరతరాలుగా వస్తున్న శివధనుస్సొకటి ఉన్నది. దాని పూర్వ గాధ తనకు తెలుసు. అది విష్ణుతేజః ప్రభావంచేత ప్రతి హతమైపోగా విసుగుజెంది పరమశివుడు తన వంశీయుల వద్ద ఇల్లడ ఉంచిపోయింది. దాని నెక్కుపెట్టి విరవగలిగితే చాలు. వాడు విష్ణువే. సందేహం లేదు. అప్పుడాయన కిచ్చి వివాహం చేస్తే సమస్య తీరిపోతుంది. అందుకోసమే జనకుడు శివధనుర్భంగాన్నే పణంగా పెట్టింది. అతనికాబుద్ధి పుట్టిందంటే అది అమ్మవారి మహిమే. ఆవిడది అద్భుతమైన జన్మే. అపూర్వంగా జన్మించి ఆయన కలాంటి అపూర్వమైన ఆలోచన కలిగించింది. తన నాథుణ్ణి ఆకర్షించటాని కది చక్కని ఉపాయం. అది ఉభయతారకం. అనన్యసామాన్యమైన ఆయన పరాక్రమమెట్టిదో లోకానికి ముఖ్యంగా రాక్షస లోకానికి చాటినట్టవుతుంది. ఆయనను తాను చెట్టబట్టినట్టూ అవుతుంది. జనకుడికే బోధపడితే ఈ రహస్యం తపోధనుడైన విశ్వామిత్రుడికి బోధ పడదా ? విశ్వామిత్రుడంటే ఎవడు ? గాయత్రీ మంత్ర ద్రష్ట. తనవాడే. తన ఉపాసకుడు, తన భక్తుడు. ఆయనా జగన్మాత ఈ సంకల్పాన్ని గ్రహించే రాముణ్ణి వెంటబెట్టుకొని అదే పనిగా మిథిలకు వచ్చాడు. నిజానికి అక్కడికి రానక్కరలేదాయన. సిద్ధాశ్రమంలో తన పని అయిపోయింది. ఇక రాముణ్ణి

Page 268

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు