శ్రీదేవి అట సీత. పతివ్రతా యాస్త పసా నూనం దగ్గోసిమే ప్రభో పతివ్రత తపోగ్నిలో బడి మిడతలాగా మాడిపోయావు గదా అని విలపిస్తుంది. మరొకచోట నతదగ్ని శిఖాకుర్యాద్యద్రామ మహిషీ స్వయం అగ్నిజ్వాల చేయలేని పని సీత చేయగల దంటుంది. చిదగ్ని జ్వాలే గదా ఆ మహాతల్లి. చేయలేని దేమున్నది. మరి లక్ష్మణుడైతే నిత్యమూ ఆవిడకు పాదాభివదనం చేయుట మేమరేవాడు కాదు. చివరకు రామాజ్ఞ శిరసా వహించి ఆవిడను ప్రాచేత సాశ్రమంలో పరిత్యజించేటపుడు కూడా అమ్మా నీ పాదాలే తప్ప ఇంతవరకూ ముఖం చూడలేదు గదా అంటాడు. అమ్మవారి పాదాలమీద భక్తి, ముభావలోకం చేయలేకపోయానే అనే తహ తహ ఇవి లక్ష్మణుడిలో తొంగిచూచే శ్రీవిద్యోపాసకుడి మాటలలాగా తోస్తాయి మనకు.
శూర్పణఖ వంటి రాక్షసి కూడా ఆవిడను వర్ణిస్తూ - నైవం రూపామయానారీ దృష్ట పూర్వా మహీతలే - దేవతేవ వనస్యాస్య రాజతే శ్రీ రివాపరా అని ఆవిడ దివ్యత్వాన్నే ధ్వనింపజేస్తుంది. అరిపత్ని అయిన మందోదరి కూడా వసుధాయాశ్చ వసుధా శ్రియః శ్రీమ్ అనిఆవిడ శ్రీతత్త్వాన్నే స్ఫురింపజేస్తుంది. ఇక వనభూముల కావిడ వెళ్లినప్పుడక్కడి ముని దారికలైతే ఆవిడను చూడగానే దేవతామివఖాచ్యు తామ్ ఈవిడ దేవలోకం నుంచి నేలమీద వాలిన దేవకన్య. నహ్యేనామ్ మానుషీం విద్మః ఈవిడ మనుష్య స్త్రీగా మాకు కనపడటంలేదని ముక్తకంఠంతో ఘోషిస్తారు. వసిష్ఠుడు కూడా ఆవిడను ఆత్మేయ మితి రామస్య - ఈమె రాముని ఆత్మశక్తే నని చాటుతాడు. ఇంతెందుకు. త్రిభువన సమ్మోహనమైన ఆమె సౌందర్య భావన చేత ఇటు రాముడూ అటు రావణుడూ కామవ్యామోహితులు కావటం కూడా ఆమె కేవలమా త్రిపురసుందరి అని కామేశ్వరి అని చెప్పక చెబుతూ ఉన్న రహస్యం.
ఈ విధంగా ఆలోచిస్తూ పోతే సీత పాత్రలో దృశ్యా దృశ్యంగా జగన్మాత పోకడలే గోచరించాయి సర్వులకూ, త్రికాల ద్రష్ట అయిన మహర్షికలాగే దర్శన మిచ్చిందా అనిపిస్తుంది. ఆయన కూడా ఒక పాత్రే గదా ఇతిహాస పాత్రలలో సరిగా జనకుడి స్థానంలో ఉన్నాడా మహర్షి అంటే జనకుడికి లాగే ఆయనకూ ప్రప్రథమంగా సాక్షాత్కరించిందా జగన్మాత మూర్తే. బాహ్యమైన మూర్తి సీత అయితే తద్వారా మనకు స్పురించే ఆంతరమైన శక్తి ఆ పరాదేవతే. సీతా చరిత్రమంతా ఈ ద్విపాత్రాభినయమే. ఒకటి బింబమైతే మరొకటి దాని ప్రతిబింబం. ఒకటి తేజస్సయితే
Page 267