మరి ఇష్టం దేనికావిడంటే గుణైఃరూప గుణైశ్చాపిఅనిఅసలు విషయం బయటపెట్టాడు. గుణాలంటే త్రిగుణాలు. దైవీహ్యేషా గుణమయీ అని గదా శాస్త్రం. గుణైః అంటే అప్పటికి పరాశక్తి. రూపగుణైః అంటే అదే వైఖరిగా మారి సీతారూపాన్ని ధరించి వచ్చిందిప్పుడు. తన్ను మరలా ఆశ్రయించింది. ఇదీ రాముడి మాటల్లో తొంగి చూచే భావం.
పోతే అరణ్యవాసానికి వెళ్లేటప్పుడు సుమిత్ర సీతను గూర్చి లక్ష్మణుడితో అన్న మాటలో కూడా ధ్వనిస్తుంది భావం. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మ జామ్. రాముణ్ణి దశరథుడుగా సీతను తల్లి అయిన నన్నుగా భావించమని పయిమాట. ఈ మాటలో ధ్వనించే రహస్యార్థమేమంటే రాముణ్ణి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనీ సీతను సాక్షాత్తూ మహాలక్ష్మి అని అర్ధం చేసుకోమని బోధపడుతున్నది. హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతను ఎక్కడా కానక విచారిస్తూ ద్రక్ష్యే తదార్యావదనంక దాన్వహం – ప్రసన్న తారాధి పతుల్య దర్శనమని వాపోతాడు. ఆర్య అంటే ఇక్కడ సీత అనేగాక ఆదిశక్తి అయిన పార్వతి అని కూడా అర్ధమే. తారాధిప అనటంలో చంద్రకళా రూపిణి అయిన పరాభట్టారిక రూపం సాధకుని మనోనేత్రానికి గోచరిస్తూనే ఉన్నది. రావణుణ్ణి బెదిరిస్తూ గృహ్యయాంనాభి జనాసి పంచా స్యామివ పన్నగీం సీతంటే ఎవరునుకున్నావు. అయిదు తలకాయల కాలభుజగి. ఆ భుజంగిని తెలియక అమాయికంగా చేతబట్టుకొన్నావు నీవంటాడు. పంచాస్య అయిన ఆ పన్నగి ఎవరో కాదు. పంచముఖి అయిన గాయత్రీ దేవతే. అంతేకాదు. యాం సీతేత్యభి జానాసి యేయం తిష్ఠతి తేవశే - కాళరాత్రీతితాం విద్ధి సర్వలంకా వినాశినీమ్. నీవు సీత అని ఎవరిని భావిస్తున్నావో ఎవరు నీవశంలో ఉన్నారని సంతోషిస్తున్నావో ఆవిడ సీతగాదు. నిజానికావిడ కాళరాత్రి అని తెలుసుకో. తదలం కాల పాశేన సీతావిగ్రహ రూపిణా. సీత అనే రూపాన్ని ధరించి కనిపించే ఆ కాలపాశాన్ని మెడకు తగిలించుకొని ఇంకా బ్రతుకుదామని ఆశపడుతున్నావా ? నిన్నూ నీ లంకనూ సర్వనాశనం చేస్తుందావిడ. గుర్తుంచుకోమని హెచ్చరిస్తాడు. నిజానికి కాళరాత్రే అమ్మవారు. కాళి - కాలస్వరూపిణి సీత అనే మానవ రూపం ధరించి వచ్చిందంత మాత్రమే. రావణ వధానంతరం మందోదరి చేసిన విలాపంలో కూడా ఇదే ధ్వనిస్తుంది. వసుధాయాశ్చ వసుధామ్ శ్రియశ్శీం భర్తృవత్సలామ్. భూదేవికి భూదేవి శ్రీదేవికి
Page 266