స్వరూపంకావు. మానుషవేషంలో ఉన్నా అందులో గర్భితమయ్యే ఉంటుంది. అయితే ఎంతవరకంటే మరుగుపడి ఉంటుంది. కాదు మరుగుపడినట్టు కనిపిస్తుంది. అది తేజోరూపిణి అయితే ఇది ఛాయారూపిణి.
సీతను ఛాయ అని వాల్మీకి వర్ణించటంలో ఈ రహస్యార్ధమే మనకు స్ఫురిస్తున్నది. జనకుడు రాముడికి కన్యాదానం చేస్తూ ఒక మాట అంటాడు. ఇయం సీతా, మమసుతా, సహధర్మచరీ తవ, ప్రతీచ్ఛచైనాం భద్రంతే, పాణింగృష్ణాష్వ పాణినా, పతివ్రతా మహాభాగా, ఛాయేవానుగతా సదా. ఈవిడ నా కుమార్తె సీత. నీకు సహధర్మచారిణిగా ఇస్తున్నాను. ఆవిడ చేయి వదలకుండా నీ చేతితో గట్టిగా పట్టుకో. పతివ్రత మహాభాగ అయిన ఈవిడ నీడలాగా నిన్నెప్పుడూ వదలకుండా అనుసరిస్తుంది. చూడండి. ఇవి ఎంత భావస్పోరకమైన వాక్యాలో. తత్త్వదర్శి అయిన రాజర్షి నోట వచ్చిన మాటలు. అర్ధస్పోరకం కాక ఎలాపోతాయి. అమ్మవారి నామావళిలో పతివ్రత సహధర్మచారిణి ఇలాంటివన్నీ వస్తాయి. శక్తి అనేది నిరాశ్రయ కాదు. అది ఎప్పుడూ ఈశ్వర చైతన్యాన్ని ఆశ్రయించే ఉంటుంది అదే పాతివ్రత్యమంటే. ఎందుకీ వ్రతం. సహధర్మచరి అనే మాటలో ఉంది సమాధానం. ఆ ఈశ్వరుడి ధర్మమే తానూ ఆచరిస్తూ ఆయనకు తోడ్పడాలి. ఏమిటా ధర్మం. దుష్టశిక్షణ శిష్టరక్షణ. అదే దేవకార్యం. అందుకోసం తాను నిత్య సముద్యత. అయితే తనపాటికి తాను సాధించేది కాదా ఉద్యమం. తాను స్వతంత్ర కాదు. పరతంత్ర. ఆ పరుడెవడో కాదు. పరాత్పరుడైన తననాథుడే ఆ నాథుని ఆశ్రయంతోనే తానీ మహాకార్యాన్ని సాధించాలి. అందుకోస మాయన ముందుగా అవతరిస్తే ఆ వెంటనే తానూ అవతరించి ఆయన ఛాయలాగా అనుగమించా లాయనను. ఇదీ మహాయోగి అయిన జనకుని మాటలలోని అంతరార్థం. ఇందుకు తగినట్టే వేదవతి రావణుడి దుడుకుతనాని కెంతగా మండిపడినా వాణ్ని తన తపః ప్రభావంచేత వెంటనే దండించటానికి సాహసించలేదు. పైగా వాడితో ఒకమాట అంటుంది. నహిశక్యస్త్రి యాహంతుం పురుషః పాపనిశ్చయః స్త్రీనైన నేను నిన్ను చంపటం సాధ్యం కాకపోవచ్చు. తస్మాత్తవ వధార్థంహి సముత్పత్స్యే హ్యహంపునః నిన్ను చంపటానికి మరలా నేను భూలోకంలో పుట్టవలసి ఉన్నది. పుట్టినా అప్పుడు కూడా స్త్రీయే గనుక తానుగా చంపరాదతణ్ణి. శక్తి లేదనికాదు. శక్తి అనేది తనపాటికి
Page 264