ఇందులో సీత దేవమాయ అని పేర్కొన్నాము. దేవమాయ కూడా కాదా మాటకు వస్తే దేవాది దేవుడైన మహావిష్ణువు మాయే ఆవిడ. విష్ణువును పెండ్లాడవలెననే ఆవిడ సంకల్పం పూర్వజన్మలో ఆవిడ వేదవతి. కుశధ్వజుడనే బ్రహ్మర్షి కూతురు. ఔరస కాదాయన కయోనిజ. నిత్యమూ ఆయన వేదభ్యాసం చేస్తుంటే వాఙ్మయ రూపంగా ఆవిర్భవించిన కన్య. వేదవతి అని నామకరణం చేసి యుక్తవయస్సు రాగానే విష్ణువు కిచ్చి వివాహం చేయాలని సంకల్పించాడా మహర్షి. ఆసంకల్పానికి వికల్పంగా దంభుడనే దానవ రాజావిడను పెండ్లాడాలని నిశీధ సమయంలో వచ్చి ఆవిడ తండ్రిని వధిస్తాడు. అది చూచి ఆవిడ తల్లి పెనిమిటి శవంతోపాటు అగ్నిప్రవేశం చేస్తుంది. వేదవతి ఒంటరిదయిపోయి ఎలాగైనా తండ్రి సంకల్పం నెరవేరాలని పట్టుదలతో హిమవచ్చిఖరంమీద తపశ్చర్య సాగిస్తుంది. తరువాత మరలా కొంత కాలానికి రావణుడు వచ్చి బలాత్కరించబోతే ఉత్తరజన్మలో వాణ్ణి సర్వనాశనం చేస్తానని బెదిరిస్తూ యోగానలంలో దగ్ధమై మరుజన్మలో సీతగా జన్మిస్తుంది. అప్పుడూ జనక చక్రవర్తి కావిడ ఔరసకాదు. అయోనిజగానే లభిస్తుందాయనకు.
ఏమిటీ కథ అంతా. వేదవతిగాదు. సీతాకాదామె వాస్తవంలో. వేదం వల్లిస్తుంటే వాఙ్మాయిగా భాసించిందన్నాడు వాల్మీకి. వాగ్రూపిణి ఆవిడ వాక్కంటే ఏ వాక్కిది. పర గావచ్చు. వైఖరి కావచ్చు. పర అయితే కేవలం శక్తిస్వరూపిణి. అదే కరచర ణాద్యవయవాలతో వ్యక్తమై ఒక ఆకృతితో కనిపిస్తే వైఖరి. అనాది నిధ నా నిత్యావాగు త్సృష్ణా స్వయంభువా అన్నట్టు అనాది నిధనయైన పరావాక్కది. కుశధ్వజుడికి వైఖరీ రూపంగా కనుల ఎదుట సాక్షాత్కరించింది. పరారూపంగా అది పరమేశ్వరుడితో ఏకమే. అది ఆయన శక్తే కాబట్టి అనన్య రూపిణి. కనుకనే దైవీహ్యేషా గుణమయీ మమ మాయా అన్నట్టు దైవి వైష్ణవి అయిన ఆ దివ్యశక్తి మరలా విష్ణువుకే అంకితం కావలసి ఉన్నది. నిత్యాన పాయిని గనుక ఆయనను విడిచి ఉండటానికి లేదు. కనుకనే కుశధ్వజుడి కావిడను విష్ణుదేవునికిచ్చి వివాహం చేయాలని సంకల్పం కలిగింది. అయితే దంభుని వృత్తాంతమేమిటి దంభదర్పాసూయాదులైన అసుర గుణాలకు ఉపలక్షణమే దంభుడనే మాట. దైవి వైష్ణవి అయిన ఆ శక్తి అసుర జాతికి వశం కాదని భావం. అది అసుర సంపదకెప్పుడూ దూరదూరంగానే ఉంటుంది. ఉత్తమే శిఖరే పర్వత మూర్ధని అన్నట్టు ఎవరికి అందని ఉన్నత శిఖరాలలో
Page 262