#


Index

హనుమ ద్విభీషణులు

ఇప్పుడేమి చేయాలతడు నోరు మూసుకొని అడవికి పొమ్మని గదా మన సలహ. అది చేతగానితనం మహాకవి దృష్టిలో. ఇక్కడ అన్న అనిగాదు మనం చూడవలసింది. రాజ్యమూ రాజని. రాజు అపమార్గం త్రొక్కితే రాజ్యమూ, ప్రజలూ పాడవుతారు. అందుచేత ఆ నిరంకుశ పాలకుణ్ణి ఎలాగైనా ప్రజలకందివ్వాలి. శాంతి భద్రతలను కాపాడాలి. అది తన ఒక్కడివల్ల అయ్యే పనిగాదు. అందుకని బలవంతుడైన మరొక మహానుభావుణ్ణి ఆశ్రయించాడు. అతడు సకల రాజ్యధర్మాలకూ నిలయమైన ఆదర్శ ప్రభువు. అతడి సహకారంతో ఈ నిరంకుశత్వాన్ని రూపుమాపి మరలా ఒక ఆదర్శరాజ్యాన్ని నెలకొల్పటమే విభీషణుడి ఈ చర్యలోని అంతరార్ధం. ఈనాటి రాజకీయాలతో పోల్చుకొని చూచారా ఇది ఎంతగానో సమంజసమనిపిస్తుంది మనకు. ఎన్నికలలో కప్పదాటుగా పైకి వచ్చి అధికారం చేతికి చిక్కింది గదా అని ఉన్నంత కాలమూ స్వార్ధపరులై ప్రజలను వేధించే పాలకుల ప్రభుత్వాన్ని కూలదోయటాని కాపక్షంలో నుంచే కొందరు భరించలేక బయటికి వచ్చి ఒక సమర్థుడి సహకారంతో దాన్ని కూలదోసి మరలా దాని స్థానంలో మరొక కొత్త వ్యవస్థను నిర్మించే యత్నం చేయటం లేదా. అలాగే ఇదీ తప్పేముంది.

  విభీషణుడి మనసులో ఉన్న ఈ సదుద్దేశమెంతగా అతని మనసులో జొరపడి చూచాడో మరి హనుమంతుడు, రాముడికి సలహా ఇస్తూ ఇలా అంటాడు. ఉద్యోగమ్ తవ సంప్రేక్ష్య-మిథ్యావృత్తంచ రావణం వాలినశ్చ వధం శ్రుత్వా సుగ్రీవం చాభిషేచితమ్-రాజ్యం ప్రార్ధయ మానశ్చ బుద్ధి పూర్వమిహాగతః తామిక్కడకి సేనా సమేతముగా రావటం చూచాడు. అన్న చేసే దుండగాలు మితిమీరి పోతున్నాయని గ్రహించాడు. ఇలాంటి దుండగుణ్ణి ఒకణ్ణి మీరింతకు ముందు శిక్షించి ధార్మికుడైన అతడి తమ్ముడికి రాజ్యం కట్టబెట్టారని తెలుసుకొన్నాడు. అలాగే ఈ దుర్వినీతుణ్ణి తొలగించి తనకు పరిపాలన బాధ్యత అప్పగిస్తే ధార్మికంగా రాక్షస రాజ్యాన్ని పాలించవచ్చునని బుద్ధి పూర్వకంగానే తమ సన్నిధికి వచ్చాడని ఉన్న విషయం బయట పెడతాడు. కాబట్టి విభీషణుడు చేసింది ఏ మాత్రము అన్యాయం కాదు. రాజనీతి దృష్ట్యా అంతకన్నా న్యాయం లేదు. రాజ్యంమీది వ్యామోహంతో వచ్చాడన్నా పొరబాటు లేదు. ఒక పదవికి తగిన సామర్థ్యమూ గుణసంపత్తి తనకున్నదనే ఆత్మవిశ్వాసమున్నవాడా పదవిని ఆశించటమూ దరఖాస్తు పెట్టుకోవటంలో పొరబాటేముంది. ఇంకా అలా చేయకపోతేనే దోషం. ఎందుకంటే సర్వసమర్ధుడయి

Page 257

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు