#


Index

హనుమ ద్విభీషణులు

-ఏకః కులేస్మిన్ పురుషో విముక్తో విభీషణస్తాత కనిష్ఠ ఏషః - ధైర్యసాహసాలు, తేజశ్శౌర్యాలు, సత్త్వవీర్యాది గుణాలు లేనివాడు మన రాక్షస కులంలో ఇంతవరకూ ఇక్కడే కనిపిస్తున్నాడు. అతడు మీ కనిష్ఠ సోదరుడు విభీషణుడే. అని మరలా పినతండ్రివైపు తిరిగి కింనామతే రాక్షస రాజపుత్రా ఎవరయ్యా ఆ రాజపుత్రులు. అస్మాకమేకేన హి రాక్ష సేన సుప్రాకృతేనాపి రణే నిహంతుం శక్తౌ మనలో పనికిమాలిన రాక్షసుడైన రూపుమాపగలడు వాళ్లను. కుతోభీషయసే స్మభీరో ఎందుకు నీవు పిఱికివాడవయి మాకందరికీ పిఱకి మందు పోస్తావు. త్రిలోకాలకూ అధిపతి కూడా. వాణ్ణి చావగొట్టి నేలమీద పడవేశాను నేను. నీకు తెలుసుగదా అని నిర్లక్ష్యంగా మాట్లాడుతాడు. దానికి విభీషణుడతణ్ణి ఇలా ముఖం వాచేలాగా చీవాట్లు పెడతాడు. నతాత మంత్రే తవ నిశ్చయోస్తి - ఒరే అబ్బాయీ ! నీకు రాజ్యతంత్రమంటే ఏమిటో అవగాహన లేదు. బాలస్త్వమద్యాపన్యవిపక్వ బుద్ధిః కుర్రవాడవు. నీకింకా బుద్ధిపక్వం కాలేదు. తస్మాత్త్వయాహ్యాత్మ వినాశనాయ వచో ర్ధ హీనం బహువిప్రలప్తమ్ కనుకనే నీవు ఆత్మ వినాశాన్ని కూడా సరకు చేయక నోటికి వచ్చినట్లు కారుకూతలు కూస్తున్నావు. పుత్రప్రవాదేనతు రావణస్య - త్వమింద్ర జన్మిత్ర ముఖోసి శత్రుః పుత్రుడనే పేరుతో జన్మించిన ఒక మిత్రముఖుడైన శత్రుడవు నీవు మీ తండ్రి రావణుడికి. ఇక నోరు మూయమని గట్టిగా మందలిస్తాడు.

  అంతటితో ఆగలేదు విభీషణుడు. ఇక ఎలాగూ పాకం తప్పింది వ్యవహారం. దేనికీ వసవసలనుకొన్నాడో ఏమో. ఇంద్రజిత్తు నేమిటి. రావణుణ్నేమిటి. అక్కడ ఉన్న వారందరినీ మందలించాడు. త్వమేవ వధ్యశ్చ సుదుర్మతిశ్చ సచాపి వధ్యోయ ఇహానయత్త్వామ్ నీవూ వధ్యుడవే. నిన్నిక్కడికి రప్పించి వాడూ వధ్యుడే పొమ్మని చాలా కఠినంగా మాట్లాడి ఉపాలంభిస్తాడు. అదంతా గమనిస్తూ ఉన్న రావణుడి కోపం పట్టలేకపోయాడు. అయినా ఋజుబుద్ధి అయిన వాణ్ణి చూస్తే వక్రబుద్ధికొక ప్రక్క భయమే. అంత దురుసుగా మాట్లాడటానికి ధైర్యం చాలదు. అయితే అతడు తనతో సహా అందరినీ సభలో చీవాట్లు పెట్టటం సహించలేక కోపోద్రిక్తుడయి కూడా అతణ్ణి ఏమీ అనలేక వసేత్సహ సపత్నేన - క్రుద్ధేనాశీ విషేణవా - నతుమిత్ర ప్రవాదేన - నివంసేచ్ఛత్రు సేవినా - ఒక శత్రువుతోనైనా కలిసి ఉండవచ్చు. ఒక విషసర్పంతోనైనా నివసించవచ్చు. కాని మిత్రుడనే పేరు పెట్టుకొని అభినయించే

Page 253

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు