#


Index

హనుమ ద్విభీషణులు

గదా అని చెప్పాడు. తరువాత కర్తవ్యాకర్తవ్యాలు నీవే నిర్ణయించుకోమని హెచ్చరిస్తాడు. దాని కతడిచ్చిన జవాబు. భయం నపశ్యామి కుతశ్చిదప్యహమ్- నాకెక్కడా ఎలాంటి భయోత్పాతము కనపడటంలేదు. నరాఘవః ప్రాప్స్యతి జాతు మైథిలీమ్. రాముడికి మరలా మైథిలినప్పగిస్తాననేది మరచిపో. సురైస్సహేంద్రెరపి సంగతః కథమ్ మమాగ్రతః స్థాస్యతి లక్ష్మణాగ్రజః సురలతో సురేంద్రుడితో కలిసి వచ్చినా నా ఎదుర నిలబడగలడా నీ రాఘవుడని చెప్పి మౌనంగా వెళ్లిపోతాడు. చూడండి. అప్పటికీ ఏమనలేక దాటేసి వెళ్లిపోయాడు.

  పోతే ఆ తరువాత ఇక ఆఖరుసారిగా రావణుడే రాక్షస బలాన్నంతా సమావేశం చేసి పిలిపిస్తే బయలుదేరి వస్తాడు. ఈసారి సామంతోనే గాదు. ఏ మార్గంలోనైనా సరే అన్నగారితో ఏదో ఐసా పైసా తేల్చుకోవాలనే వచ్చాడు. వచ్చి యధాపూర్వకంగా పాదాభివందనం చేశాడు. అనుజ్ఞ వడసి ఉచితాసనం మీద ఆసీనుడయ్యాడు. ఇక కుంభకర్ణుడేమి మహాపార్శ్వుడేమి, ప్రహస్తుడేమి మొదలుపెట్టారు ప్రతిఒక్కరూ సలహా ఇవ్వటానికి. వారి అధిక ప్రసంగాలన్నీ ఆలకించి విభీషణుడు ప్రహస్త రాజాచ మహోదరశ్చ, త్వం కుంభకర్ణశ్చ - యదర్థజాతమ్ బ్రవీధ రామం ప్రతి తన్న శక్యమ్ ఓరీ ప్రహస్తా మీ రాజు మీ రాజ సహోదరుడు కుంభకర్ణుడు, మహోదరుడూ, నీవూ, మీరంతా రాముణ్ణి ఏదోచేయాలని చూస్తున్నారే. అది అసంభవం. వధస్తురామస్య మయా త్వయావా ప్రహస్త సర్వైరపి రాక్షసైర్వా - కథంభవేత్, మహార్ణవం తర్తు మివాప్లవస్య. రాముణ్ణి రూపుమాపటం నీచేత గాదు. నాచేతగాదు. ఏ రాక్షసులచేతా గాదు. అది వట్టి మాట. నరావణోనాతి బలస్త్రి శీర్ణో - నకుంభకర్ణో స్యసుతో నికుంభః - నచేంద్రజిద్ధాశరథిం ప్రసోధుం - సమర్థాః రావణ కుంభకర్ణాదులెవరూ పనికిరారు. చేతనైతే అనంత భోగేన సహస్ర మూర్ధాబలాత్పరి క్షిప్తమిమం భవంతో - రాజాన ముజ్జిప్య విమోచయంతు. సహస్ర ఫణాలు విప్పి ఒక మహాభుజంగం మీ రాజును కాటు వేయబోతుంది. వెంటనే జాగ్రత్తపడి ఆయనను విడిపించుకోండి. ఎందుకీ బోగుబడి ప్రసంగాలని విసిరి వాట్లు పెడతాడు.

  అంతలో రావణకుమారు డింద్రజిత్తు కెక్కడలేని ఆగ్రహం వస్తుంది. పినతండ్రి వైపు చూడకుండా తండ్రివైపు చూచి కిన్నామతేతాత కనిష్ఠ వాక్యమ్ ఏమిటి నాన్నా! మీ పినతమ్ముడి మాట. సత్త్వేనవీర్యేణ - పరాక్రమేణ - శౌర్యేణ ధైర్యేణచ తేజసాచ

Page 252

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు