కానీ సీతాపహరణంతో అన్నగారి చర్య శ్రుతిమించి రాగాన పడింది. ఇక జాగుచేస్తే ప్రయోజనంలేదని గ్రహించాడు విభీషణుడు. అది రాక్షస వంశ వినాశనానికే నాందీ అని తోచి ఉంటుందా మహాపురుషుడికి. అందుచేత అలాంటి మహోపద్రవం రాగూడదని అప్పటినుంచీ అతడికి హితం చెప్పటానికి పూనుకొన్నాడు. ఆ పూనికలో మొట్టమొదటి ఘట్టం దూత వధ నివారణం. రాముడి దూతగా వచ్చిన హనుమంతుణ్ణి చంపటాని కాజ్ఞాపించాడు రావణుడు. అంతవరకూ ఉపేక్షిస్తూ వచ్చిన విభీషణుడు తంరక్షోధి పతిం క్రుద్ధం-తచ్ఛకార్య ముపస్థితం - విదిత్వా నిశ్చితార్థ స్తతస్సామ్నాపూజ్యం శత్రుజి దగ్రజం – ఉవాచ చాలా కోపంగా ఉన్నాడన్న దారుణమైన పని తలపెట్టాడు. కార్యం మించి వచ్చింది. తెలిసి తానుపేక్షించరాదు. అయినా అన్న కాబట్టి తనకు పూజ్యుడు. అందుకని సామంగా ఇలా సలహా ఇచ్చాడట. దీనివల్ల అతడెంత నిదానస్తుడో భ్రాతృగౌరవం గలవాడో అయినా సమయోచిత కార్యదక్షుడో మనం గ్రహించవచ్చు. రాజధర్మ విరుద్ధంచ లోకవృత్తేశ్చ గర్హితం తవచాస దృశం వీర కపేరస్య ప్రమాపనమ్. రాజనీతికి లోకనీతికీ దూరమైనది ఈ చర్య. నీబోటి మహావీరుడు చేయవలసినది కాదు. గృహ్యంతే యది రోషేణ త్వాదృశోపి విపశ్చితః తతశ్శాస్త్ర విపశ్చిత్త్వమ్ - శ్రమ ఏవహి కేవలమ్. నీబోటి శాస్త్రవేత్తలే ఇలా కోపావేశంతో ప్రవర్తిస్తే ఇక శాస్త్ర పాండిత్యమనేది కేవలము ఒక శ్రమేగాని మరేదీ కాదంటాడు. ఇప్పటికిప్పుడన్న మాటలుకావు. ఎన్నాళ్ల బట్టో అతడికి చెప్పాలనుకొన్న మాటలిప్పుడా మహాత్ముడినోట వెలువడ్డాయా అనిపిస్తుంది. నీవసలు సీతాపహరణం చేయటమే తప్పు. దానికి తోడు దూత వధ కూడానా. ఇదా నీ శాస్త్రజ్ఞాన కౌశలం అని వెక్కిరించినట్టున్నదీ మాట.
తాను చేసిన పనికి రాముడు సైన్యంతో వచ్చి సముద్ర మావలితీరంలో విడిశాడని తెలిసి రావణుడొక సమావేశ మేర్పాటుచేస్తాడు. అనుజహిత మంత్రి దండనాథులనందరినీ దనకు కర్తవ్యమేమిటో చెప్పమని సలహా అడుగుతాడు. ప్రహస్తాది రాక్షసులంతా వెళ్లి పొడుస్తాం చేస్తామని భీకరాలు పలుకుతారు. అప్పుడు విభీషణుడు వారందరినీ మందలించి రావణుణ్ణి చూచి ఇలా అంటాడు. సామ దాన భేదాలతో చక్కబడకపోతేనే దండోపాయమనేది. రాముణ్ణి దండించటానికి మనమెవరం. అతడు దురాధర్హుడు. అతడు పంపిన దూతకే జవాబు చెప్పలేక
Page 250