వాటి ప్రభావమెక్కడికి పోతుంది. అందులో రజోగుణం రావణుడైతే-తమోగుణం కుంభకర్ణుడు. పోతే ఇక సత్త్వగుణ మేమయినట్టు. ఏమయ్యేదేముంది. అదే విభీషణుడు. గంజాయి వనంలో తులసిమొక్కలాగా జన్మించాడు. అసలు దైవసంకల్పమే అలాంటిది. కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రజస్తమోగుణాలతో జన్మిస్తే హిరణ్యుని కుమారుడు సత్త్వగుణ సంపన్నుడు ప్రహ్లాదు డుదయించాడు. రెంటికీ ఉండే వైషమ్యం చూచి మానవులకేది వర్జ్యమో ఏది ఉపాదేయమో బోధ చేయటానికే గదా ఇదంతా.
మొదటి నుంచీ విభీషణుడు కనిపెడుతూనే ఉన్నాడు అన్నల స్వభావ మెలాంటిదో. వారూ కనిపెడుతూనే ఉంటారు బహుశా అతణ్ణి. ముగ్గురూ పెరిగి పెద్దవారయినారు. బ్రహ్మను గూర్చి తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షమైతే అవధ్యత్వం కోరాడు రావణుడు. అందరివల్లా కోరినవాడు మానవులవల్ల కోరక దెబ్బతిన్నాడా అహంకారి. కుంభకర్ణుడు నిద్రాదేవి ఆవేశించి దానినే కోరి అందులోనే పడి చివరకు మ్రందిపోయాడు. పోతే విభీషణుణ్ణి చూచి పితామహుడు విభీషణ త్వయావత్స ధర్మ సంహిత బుద్ధినా పరితుష్టోస్మి ధర్మాత్మన్. నాయనా నీవు చాలా ధర్మశీలుడవు. నీ సచ్చరిత్రకు నేను సంతసించాను. వరం కోరమంటాడు విభీషణుడిలా వరం కోరతాడు. పరమాప తస్యాపి - ధర్మే మమ మతిర్భవేత్ గొప్ప ఆపద సంభవించినప్పుడు కూడా నా బుద్ధి ధర్మం తప్పగూడదు. ఏ ఆశ్రమంలో ఉన్నా ఆ ఆశ్రమ ధర్మం నేను పాటించగలగాలి. వీలయితే బ్రహ్మాస్త్రమొక్కటీ ప్రసాదించండి. నహి ధర్మాభియుక్తానాం లోకే కించన దుర్లభమ్. ధర్మైక నిరతులకు లోకంలో దుర్లభమంటూ ఉండబోదు. కదా అంటాడు. పితామహుడా మాటలకు ప్రీతుడై అడగకుండానే అతని కమరత్వం కూడా ఇచ్చి వెళ్లిపోతాడు. చూడండి. అడిగినా పూర్తి అమరత్వం అబ్బలేదు రావణుడికి. అడగకుండానే అబ్బింది విభీషణుడికి. దీనికి జవాబు విభీషణుడి మాటలలోనే ఉంది. ధర్మాభిరతుడికేదీ దుర్లభం లేదని గదా అతని సుభాషితం.
జన్మలో వరప్రాప్తిలోనే గాక అన్నదమ్ములకు తేడా వారి వివాహంలో కూడా కనిపిస్తుంది. రావణుడు మయుడి కన్యను మందోదరిని చేసుకుని కుంభకర్ణుడికి వజ్రజ్వాల అనే దాన్ని విభీషణుడికి సరమ అనే దాన్ని తెచ్చి పెండ్లి చేస్తాడు. సరమారామ ధర్మజ్ఞా వారిలో సరమ చాలా ధర్మశీల అట. ధర్మజ్ఞుడైన విభీషణుడికి
Page 248