సత్త్వగుణమే దీనికి తగిన ఔషధం. శుద్ధమైన ఈ సత్త్వానికి ప్రతీకే విభీషణ పాత్ర. ఎప్పటి నుంచో ఉన్నదీ సత్త్వగుణం మనలో అంతర్లీనమయి. అయితే రజస్తమో గుణప్రాబల్యం మూలంగా అది పైకి పొంగలేదు. పొంగితేగాని జ్ఞానోదయం కాదు. అయితే గాని భగవద్దర్శనానికి నోచుకోలేడు జీవుడు. ఈ రహస్య భావానికి ద్యోతకమే విభీషణ పాత్ర. అంతవరకూ రంగంలో లేకుండా మరుగుపడి ఉండటం, ఒక్కసారిగా ఉచ్చులు తెంచుకొని వచ్చి రామదర్శనం చేయటం.
అసలు విభీషణుడి రాక యుద్ధకాండారంభంలో కనిపించినా లోకంలోని కాయన రాక గ్రామావతారానికి ముందే జరిగింది. రావణాదులంతా రాముడికి ముందే జన్మించారని గదా వెనుక వర్ణించాము. వారితోపాటు జన్మించినవాడే విభీషణుడు. వారితోపాటు జన్మించాడనే గాని వారి స్వభావం రాలేదతనికి. వాలి వధానంతరం సుమాలి అనే దానవుడు విశ్రవోముని కుమారుడైన కుబేరుడి ఐశ్వర్యాన్ని చూచి సహించలేక తన కూతురు కైకని విశ్రవసుడి దగ్గరికి పంపుతాడు. పుత్రగర్ధిని అయి వచ్చిన ఆవిడ హావభావాలర్ధం చేసుకొని అకాలంగా వచ్చి కామించావు. కాబట్టి అతిదారుణ స్వభావులు నీకు పుత్రులుగా జన్మిస్తారంటాడు. అంత దుర్మార్గులను భరించలేనని వేడుకొంటే పశ్చిమోయస్తవసుతో - మమవంశాను రూపశ్చ ధర్మాత్మాచ భవిష్యతి. కడపట పుట్టినవాడు మాత్రం మాబ్రహ్మవంశాన్ని నిలబెట్టే ధర్మాత్ముడవుతాడని అనుగ్రహిస్తాడు. అతడే విభీషణుడు. ఆయన చెప్పినట్టుగానే రావణుడు పది తలలతో పుట్టి పుట్టగానే దారుణంగా ఆక్రందన చేస్తాడు. ఉల్కాముఖాలతో సృగాలాలు తిరిగాయి. మేఘాలు రుధిర వర్షం కురిశాయి. పిడుగులు పడ్డాయి. భూమి వణికింది. సముద్రం ఘార్ణిల్లింది. సూర్యమండలం మాసిపోయింది. ఇలా ఎన్నో ఉత్పాతాలు జరిగాయి. తరువాత వరుసగా కుంభకర్ణుడూ శూర్పణఖా జన్మిస్తారు. ఆతరువాత జన్మిస్తాడు విభీషణుడు అతడు జన్మించేసరికి పుష్పవర్ణం కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. దేవతలంతా అంతరిక్షంలో చేరి సాధు సాధు అని కేకలు వేశారు.
ఎవడి స్వభావం వాడి పుట్టుకలోనే తెలుస్తుందంటారే. అది ఇదే. అన్నలెలా పుట్టారు. తమ్ముడెలా పుట్టాడు. అన్నలంటే వారెవరు. జయవిజయులే గదా. జయవిజయులంటే ఏమని చెప్పాము. రజస్తమోగుణాలకు సంకేతాలని గదా. మరి
Page 247