#


Index

హనుమ ద్విభీషణులు

పూర్తిగా పనిచేసిందని అర్ధం. హారం సత్త్వశుద్ధికి ప్రతీక సత్త్వాత్సంజాయతే జ్ఞానమన్నారు. తత్ప్రసాద సిద్ధిజన్యమే ఆత్మజ్ఞానం ఆ సాధకుడికి. తత్ఫలితమే హనుమంతుని అజరామరత్వం. జ్ఞానఫలమైన ముక్తి. అయితే ఇది జీవన్ముక్తి, జన్మతారకమైన రామమంత్రాన్ని సాధకుల కుపదేశించి నలుగురినీ తరింపజేసే బాధ్యత అప్పగించాడు పరమాత్మ అతనికి. ఇలాంటి బాధ్యతకే శాస్త్రంలో అధికారమని పేరు. వారికాధికారిక పురుషులని పేరు. లోక సంగ్రహమే వారి ధ్యేయం. అదే హనుమ జీవితం. స్వయంతీర్ణః పరాంస్తారయతి. అతడు తరించి మనలను తరింపజేస్తున్నాడు. అప్పటికీ ఇప్పటికీ ఆయన బ్రహ్మచారి. నిత్యమూ రామబ్రహ్మమునందే చరిస్తుంటాడు. బ్రహ్మచారి అయి కూడా సువర్చలా వల్లభుడు. సువర్చస్సు బ్రహ్మతేజస్సే. అది గల బ్రహ్మవిద్వరిష్ఠుడాయన. సూర్యనారాయణుడివల్ల సకల వేదాలు వేదాంగాలూ అధ్యయనం చేసి, అపర సూర్యనారాయణుడైన రామబ్రహ్మంవల్ల సకలోపనిషత్తులు శ్రవణం చేసి ఆత్మభావేత్వ మేవాహమని ఆయన పెట్టిన కడపటి పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయి సముద్రలంఘనమనే నెపంతో సంసారసాగరాన్నే లంఘించి దేవాత్మ శక్తిమ్స్వగుణైర్ని గూఢమన్నట్టు హృదయగుహ లాంటి లంకలో దేవీ దర్శనం చేసి ఆ దివ్యశక్తిని సహస్రారం లాంటి అయోధ్యలో రామేశ్వర తత్త్వంతో జతచేసి శివశక్తి సామరస్యరూపమైన ఆ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించి పులకించి తన జీవితాన్ని మన జీవితాన్ని ధన్యం చేసిన లోకమాన్యుడైన ఒక గొప్ప ఆచార్య పురుషుడు హనుమంతుడంటే.

  హనుమంతుడికి సరిజోడు విభీషణుడు. భరత లక్ష్మణులెలాగో వీరూ అలాగే ఒకరికొకరు. అతడు కిష్కింధలో కనిపిస్తే స్వామివారికితడు తీరా ఇక యుద్ధమారంభమయ్యేటపుడు కలుసుకొన్నాడాయనను. అతడు చివరదాకా అంటిపట్టుకొన్నట్టే ఇతడూ అంటిపట్టుకున్నాడు. అసలు మొదటినుంచీ పట్టుకొన్నవారే ఇద్దరూ. ఆదిలో మరుగుపడి మధ్యలో ఒకరు ఆది మధ్యలలో మరుగుపడి అంతంలో ఒకరూ దర్శనమిచ్చారంతే. హనువంటే జ్ఞానానికి ప్రతీక. జ్ఞానవంతుడెవడో వాడు హనుమంతుడు. పోతే భీషణుడు కానివాడెవడో వాడు విభీషణుడు. భీషణమైనవి రెండే మానవుడికి. ఒకటి రజోగుణం, మరొకటి తమోగుణం. ఈ రెండింటి బిభీషిక వల్లనే మనకీ భయంకరమైన సంసారవ్యాధి సోకింది. ఇది పూర్తిగా తొలగిపోవాలంటే

Page 246

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు