కావు ప్రాణాపానాలే. నిత్యమూ చక్రాకారంగా ప్రసరిస్తూనే ఉంటాయవి. స్వస్తి నస్తార్ట్ల్యో 2 రిష్టనేమిః అని వేదం చెబుతున్నది. నేమి అంటే చక్రం. అది రిష్టం కావటమంటే భగ్నమైపోవటం. భగ్నం కాకుంటే అరిష్టం. ఎప్పుడూ నిలవకుండా ప్రసరించే చక్రం ప్రాణమే. అదే తార్జ్యుడు. గరుత్మంతుడంటే తార్జ్యుడు. అంటే జగత్రాణమన్నమాట. కనుకనే వాయుదేవునివల్ల అంజనకు జన్మించాడు హనుమంతుడని చెప్పటం. అంజన ఎవరు. నిరంజనుడైన ఈశ్వరుడి కుపాధి అంజన. మాయాశక్తి. కేసరి ఆ ఈశ్వరుడే. కేసరములాయన జ్ఞానకిరణాలు. అవి అంజనమీద ప్రసరించాయి. దానికి ప్రాణశక్తి రూపమైన వాయువు తోడయింది. ఇంకేమి జీవాత్మరూపుడాంజనేయుడు జన్మించాడు. కేసర స్థానమైన దాత్మ. వాయుస్థానమైనది జీవం. రెండూ కలిసి జీవాత్మ. వాడే ఆంజనేయుడు. ప్రాణశక్తి ప్రధానుడైన వైనతేయుడు.
రామకార్యం కోసమే నంటే ఆత్మారాముణ్ణి సేవించి తరించటానికే ఈ జీవుడి ఆవిర్భావమని భావం. అది కర్మయోగం దగ్గరినుంచీ జ్ఞానయోగందాకా ఉంటుందా సాధన. మొదట భూమిక కర్మయోగం. అదే నిస్స్వార్థంగా ఫలనిరపేక్షంగా హనుమంతుడు స్వామివారి కార్యాలను సాధించటంలో చూపిన శ్రద్ధ. రెండవ భూమిక సమాధియోగం స్వామిమీద ఏకాగ్ర బుద్ధితో ధారణాధ్యానాదులు చేసి అణిమాద్యష్ట సిద్ధులు సంపాదించాడు. కామరూపాది విభూతులూ ప్రాప్తించాయతనికి. ఆకాశ గమనంలో లఘిమ - సింహకాదుల విషయంలో అణిమ లంకిణిమీద దూకినప్పుడు గరిమ, సీతదగ్గర మహిమ, రాముణ్ణి దర్శించిప్పుడు ప్రాకామ్యం, ఇలాంటివన్నీ హనుమంతుడి యోగసిద్ధిని సూచిస్తాయి మనకు. తరువాత మూడవది భక్తియోగం. అది ఇక చెప్పనే అక్కరలేదు. నీమీద భక్తి నాకు నిశ్చలంగా ఉండాలని ఆయననే వరం కోరుతాడు గదా. రామసంకీర్తన చేస్తూ అలాగే ఉంటావని దీవించాడు గదా రాముడు. పోతే ఆఖరిది జ్ఞానయోగం. అది వీటన్నిటి పరిపాక ఫలం. జీవుడి ప్రయత్నమెంత ఉన్నా భగవదనుగ్రహముంటే గాని ఉదయించదది. దానికి సంకేతమే రాముడు రెండు మార్లతని నాలింగనం చేసుకోవటం. సర్వాంగ దీక్ష ఇది. తద్వారా భగవచ్ఛక్తి భాగవతుడిలో పూర్తిగా ప్రవేశించి అతడిలో జ్ఞాన జ్వాలను మేలుకొలుపుతుంది. ప్రజ్వలింపజేస్తుంది. సీతా రాములిద్దరూ అపూర్వమైన హారాలు తీసి ఇవ్వటం కూడా ఇందుకు ద్యోతకమే. ప్రకృతి పురుషుల ఇరువురి అనుగ్రహము
Page 245