#


Index

హనుమ ద్విభీషణులు

హనుమంతుడి బలం. అంతేకాదు. వారికి లేని ధైర్య దాక్ష్యనయవిక్రమ ప్రజ్ఞాది గుణాలు కూడా ఉన్నాయాయనలో. సముద్ర లంఘనం మొదలుకొని ఇప్పటిదాకా అతడు చేసిన వీరకృత్యాలిన్ని అన్నీ కావు. అలాంటివాడు కిమర్ధమ్ వాల్యనేనైవ నదగోవీరుధో యథా సుగ్రీవుడికి కొండంత అండగా ఉండి కూడా అప్పుడే వాలినెందుకు రూపుమాపలేదు. “నహివేదితవాన్ మన్యేహనూ మానాత్మనో బలమ్ యద్ధృష్టవాన్ జీవితేష్టం క్లిశ్యంతం వానరాధిపమ్” బహుశా తనబలం తనకే తెలిసి ఉండదీ మహానుభావుడికి. అందుకే తన ప్రభువు వాలి చేతిలో అంత కడగండ్లు పడుతున్నా గ్రుడ్లప్పగించి చూస్తూ ఊరకున్నాడు. చూడండి. రాముడికెలా తెలుసు హనుమంతుడికి తన బలం తనకే తెలియదని. ఎవరు చెప్పారు. పైగా వాలి రావణుల నతడే మట్టుపెట్ట గలిగికూడా ఎందుకూరకున్నాడని అడగటం కూడా కావాలని * అడగటమే. ఆయనకు తెలియదా ఎందుకూరుకున్నాడో. అది తన భృత్యుడి కృత్యంకాదు. తన కృత్యం. అది హనుమంతుడికికూడా తెలుసు. స్వామివారు చేయవలసిన పనేనని. రావణాదులతో చేసిన ప్రసంగంలో వాచా అన్నాడు కూడా కాబట్టి భగవద్భాగవతులిద్దరూ దొంగలే ఒకరి సంగతొకరికి తెలిసి కూడా తెలియనట్టే ; మెలగుతారు. అడుగుతూ పోతారు. అలాగే అడిగాడు రాముడగస్త్యుణ్ణి. తనకోసం కాకపోయినా తనచుట్టూ ఉన్న దానవ మానవ వానరులంతా ఆయన కలరూపు గ్రహించాలని.

  అగస్త్యుడు చెప్పసాగాడు. కేసరి అనే వానరుడికి అంజన అనే భార్య ఉండేది. ఆవిడకు వాయుదేవుని అంశతో జన్మించాడీ హనుమంతుడు. అంజనాపుత్రుడు గనుక ఇత డాంజనేయుడయ్యాడు. వాయుపుత్రుడు గనుక మారుతి అయ్యాడు. పోతే బాల్యంలోనే ఆకాశంలో దూరాన ఉదయించే సూర్యమండలాన్ని చూచి పండని భ్రమించి పట్టుకోవాలని పైకెగిరి పోయాడు. అది ఇంద్రుడికి తెలిసి వజ్రాయుధం ప్రయోగిస్తే నేలకొరిగి ఒక హనువు భగ్నంకాగా అప్పటినుంచీ హనుమంతుడని పేరు వడశాడు. తరువాత వాయుదేవుడలిగి ప్రాణనిరోధం చేశాడు సమస్త ప్రాణులకూ. దానితో బ్రహ్మాది దేవతలంతా వచ్చి అతణ్ణి అనునయించి హనుమంతుని కనేకవరాలు ప్రసాదిస్తారు. సకల శస్త్రాలచేత అవధ్యత్వము, సకల శాస్త్రాధ్యయన సామర్ధ్యము, వాక్పాటవము, మృత్యుంజయత్వము, అరోగిత్వము, అశ్రమత్వము

Page 243

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు