మరి ఉత్తర రామాయణంలో చివర హనుమంతుడు స్నేహోమే పరమో రాజంస్త్వయి తిష్ఠతి నిత్యదా - భక్తిశ్చనియతా వీర - భావోనాన్యత్ర గచ్ఛతు రామా నీ మీదనే నాకు భావమూ భక్తి. ఆ భావం నాకెప్పుడూ సడలకుండా దీవించు. నీ చరిత్ర నమరులు గానం చేస్తుంటే వింటూ నేనెంత కాలమైనా జీవితం గడపాలని ఉందని వేడుకొంటాడు. అది విని రాముడు లేచి వచ్చి కౌగిలించుకొని "ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్యామితేకపే - శేషస్యేహోపకారాణాం భవేమ ఋణినో వయమ్” నీవు చేసిన ఒక్కొక్క ఉపకారాని కొక్కొక్క ప్రాణమివ్వాలి నేను. మిగిలిపోయిన దేదైనా ఉంటే దానికి మేమిక ఋణపడి ఉండవలసిందే. మదంగే జీర్ణతామేతు యత్త్వయో పకృతంకపే - నరః ప్రత్యుప కారాణా మాపత్స్వాయాతి పాత్రతామ్ నీవు చేసిన మహోపకారం నా శరీరంలోనే జీర్ణమగుగాక. మరలా నీకు నేనుపకారం చేయటమంటే నీకు అలాంటి ఆపద రావాలని కోరుకోవటమే. శిఖరాయ మాణమైన శ్లోకాలివి రామాయణంలో. ఈ మాట అంటూ మరి ఒక హారం స్వయంగా అతని కంఠంలో వేస్తాడు. పైగా నిర్వాణమై పోయే ముందు రాముడందరికీ అన్ని మాటలు చెప్పి వీడ్కొలుపుతూ హనుమంతుడు కూడా తనతో వస్తానంటే నివారిస్తూ జీవితేకృత బుద్ధిస్త్వం మా ప్రతిజ్ఞాం విలోపయ - నన్ను కీర్తిస్తూ బ్రతకాలని గదా వరం కోరావు. నాకథ ఎంత కాల మీలోకంలో ఉంటుందో అంత కాలమూ కథాగానంచేస్తూ భక్తి పారవశ్యంతో పులకిస్తూ జీవిస్తావు నీవు పొమ్మని దీవిస్తాడు. ఆ దీవెనతో ఇప్పటికి రామ భక్తికి సంకేత కేతనంగా మనకదృశ్యంగా నిలిచే ఉన్నాడా మహానుభావుడు.
ఇదంతా చూస్తుంటే భగవద్భాగవతులిద్దరికీ ఎప్పటినుంచో ఉన్న అనుబంధమని తోస్తుంది మనకు. ఇద్దరికీ తెలుసు హృదయాలలో ఒకరి సంగతి ఒకరికి. తెలియక పోతే నీవంటే నాకు ఎనలేని భక్తి, నీగుణగానం చేస్తూ జీవించాలని వేడుకొంటాడా ఈయన. అలాగే ఉంటామెప్పటికీనని ఆశీర్వదిస్తాడా ఆయన. ఆయన కీయన ఎవరో తెలుసుబాగా. తెలిసి కూడా మాయా మానుషుడు కాబట్టి అన్నిటిలాగానే ఇదికూడా తెలియనట్టు నటిస్తూ ఈ హనుమంతు డెవరండీ ఇంతమంది నా ఆశ్రితులున్నారుగాని ఇంత యోగ్యత ఉన్నవారెవరూ కనిపించటం లేదితని పుట్టు పూర్వోత్తరాలేమిటసలు. అని ప్రశ్నిస్తాడు అగస్త్యుణ్ణి. తెలిసే అడగటాని కేమిటి గుర్తు. ఆయన అడిగిన ప్రశ్న తీరునుబట్టే చెప్పవచ్చు. మహర్షీ రావణుడూ వాలీ వీరి బలంకన్నా గొప్పది
Page 242