#


Index

హనుమ ద్విభీషణులు

కలుపుకొందామా లేదా అని అందరినీ సలహా అడిగాడు రాముడు. అందరూ తలకొక సలహా ఇచ్చారు. చివరకు హనుమంతుడయ్యా ! ఇతణ్ణి మనం శంకించ నక్కరలేదు. “దౌరాత్మ్యం రావణే దృష్ట్వా - విక్రమంచ తథాత్వయి యుక్తమాగ మనంతస్య" నిష్కారణంగా రాలేదితడు. ఇతడు వచ్చాడంటే తన అన్న దుర్మార్గాన్ని భరించలేక నీవెలాగూ అతణ్ణి వధించటం ఖాయమని తెలుసుకొనే వచ్చాడు. అంతేకాక నత్వస్య బ్రువతో జాతు లక్ష్యతే దుష్టభావతా ప్రసన్నం వదనం చాపి తస్మాన్మే నాస్తి సంశయః ఆకారశ్ఛాద్యమానోపి నశక్యో వినిగూహితుం బలాద్ధి వివృణోత్యేవ భావ మంతర్గతం నృణామ్ ఆకారమెంత కప్పి పుచ్చినా దాగదు. బలవంతంగా లోపల ఉన్న భావాన్ని బయట పెడుతుంది. ఇతడు మాట్లాడుతుంటే దుష్టత్వమేదీ కనబడటం లేదు. ముఖవర్ణం చాలా ప్రసన్నంగా ఉంది. ఎందుకు వచ్చాడనే గదా మన అనుమానం. నేను చెబుతాను వినండి. నీ యుద్ధ సన్నాహం విన్నాడు. అన్న పనికిమాలితనం బాగా చూచాడు. వాలిని నీవు వధించి సుగ్రీవుడి కభిషేకం చేయటం విన్నాడు. రాక్షస రాజ్యం తనకే దక్కుతుందని ఖాయంచేసుకొని బుద్ధి పూర్వకంగా వచ్చి తమరిని శరణుజొచ్చాడు. చూడండి. మానవ మనస్తత్త్వ పరిశీలనలో ఎంత సిద్ధహస్తుడో హనుమంతుడు.

  ఇలా ఎంచుతూ పోతే ఎంత దూరమైనా పోవలసి వస్తుంది. వర్ణించవలసి వస్తుందాయన మహత్త్వం. యుద్ధభూమిలో ఆయన చూపిన పరాక్రమంగాని, లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు పర్వతానికి పర్వతాన్నే పెకలించి తెచ్చిన సాహసంగాని, ఇక వర్ణనాతీతం. ఇంత బలపరాక్రమాలు ప్రదర్శించి కూడా నాదేమిటంతా రామచంద్ర ప్రభుపాద రజోలేశ ప్రభావమే నంటాడా మహానుభావుడు. ఆ భక్తుని అనుభావమేమిటో ఎలాంటిదో బాగా తెలిసినవారు స్వామి వారొక్కరే. మరెవరూ కాదు. సీతా వృత్తాంతం వచ్చి వినిపించగానే ఇంత మంచి మాట చెప్పిన నీకు నేనేమీయగలను. ఏష సర్వస్వభూతో మే పరిష్వంగో హనూమతః ఇదుగో ఈ పరిష్వంగమొక్కటే నేను నీకీయ గలిగింది. ఇదే నా సర్వస్వం. స్వీకరించమంటాడు. అలాగే పట్టాభిషేక సమయంలో అనర్హమైన ఒక హారం మెడలో నుంచి బయటికి తీసి ఎవరికిద్దామా అని సీత ఆలోచిస్తుంటే ఆవిడ మనోభావం కనిపెట్టి నీకెవరిష్టులో వారికివ్వమంటే రాముడావిడ అది హనుమంతుడికే ప్రసాదిస్తుంది.

Page 241

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు