
రాజ్యానికే హడలు పుట్టించింది. ఇంద్రజిత్తు బంధించి రావణుడి వద్దకు కొనిపోయినప్పుడు కూడా జంకు కొంకు లేక అతడికి సలహా ఇవ్వటము, బెదిరించటముకూడా అతని నయపరాక్రమాలు రెండింటినీ చాటుతుంది. రావణునిలో ఉన్న గుణగణాలను మెచ్చుకొంటూనే 'నహిధర్మ విరుద్దేషు - బహ్వ పాయేషు కర్మసు - మూలఘాతిషు సజ్జంతి బుద్ధిమంతో భవద్విధాః సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తిసః యోరామం ప్రతియుధ్యేత విష్ణుతుల్య పరాక్రమమ్ సర్వలోకేశ్వర స్యైవంకృత్వావిప్రియమీదృశం రామస్యరాజ సింహస్య - దుర్లభం తవ జీవితం కామంఖల్వహమప్యేకః సవాజిరథకుంజరాం లంకాం నాశయితుం శక్తస్తస్యైషతున నిశ్చయః నీబోటి బుద్ధిమంతు డిలాంటి నీచమైన పనులు చేయవచ్చునా? సమస్త లోకాలలో సమస్త దేశాలలో సమస్త భూతాలలో మా రామమూర్తి నెదిరించి నిలవగల వారున్నారా ? విష్ణు తుల్య పరాక్రముడాయన. అలాంటివాడి కెగ్గుచేసి నీవు బ్రతకటానికేనా. అసలు నేనొక్కడనే చాలు. నిన్ను నీ పరివారాన్నీ నాశనం చేయటానికి. అయితే రామాజ్ఞ అలా లేదు. కాబట్టి బ్రతికిపోయా వంటాడు. రాముడంటే హనుమంతుడి అభిప్రాయమేమిటో ఈ మాటలలో స్పష్టంగా తేటపడుతుంది. అంతేకాదు. రావణ సంహారార్థ మాయనే అవతరించాడనీ ఆయన చేయవలసినదే గాని ఎంత సమర్థత ఉన్నా అది ఇతరుల కార్యం కాదని కూడా తెలుసు ఆ మహాత్ముడికి. అందుకేనేమో వాలిని వధించటంలోగాని సీతను రావణుడెత్తుకు పోతుంటే ఆవిడ ఆక్రందన విని పైకి చూచికూడా అతణ్ణి అటకాయించటంలో గాని ఎలాంటి సంరంభమూ చూపకుండా మౌనం వహించింది హనుమంతుడు. ఇప్పుడర్థమవుతుంది మసకీమాటల్లో రాముడి తరువాత ఇలాంటి పూర్వాపర పరిజ్ఞానం ఒక్క హనుమంతుడికే ఉంది రామాయణంలో మరెవరికీ కానరాదని చెప్పటానికిలాంటివే తార్కాణాలు.
అంతేకాదు. రాముడొకరిని సలహా అడుగుతున్నా అది వారి స్వభావాన్ని తెలుసుకోవటానికే. వారి మాట పాటించటానికి కాదు. తాను చేయవలసిందేదో తనకు మాత్రమే తెలుసు నాయనకు. స్వామివారి ఈ సంకల్పమేమిటో దుర్భిణీ వేసుకొని చూచినట్టు ముందుగానే పసిగట్టి దాని కనుగుణంగా మాట్లాడగల వాడొక్క హనుమంతుడే. అతడొక్కడే రామహృదయజ్ఞుడు. విభీషణుణ్ణి తమలో
Page 240
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు