లేకపోలేదు. మరా అంటే మరణం. మరా అనే అక్షరాలు పలుకుతున్నాడంటే మరణాన్ని గూర్చి విచారిస్తున్నాడు సాధకుడు. మరణాన్ని గూర్చి విచారిస్తే అది అమరణమైన మోక్షస్వరూపాన్ని చూపుతుంది. మృత్యోర్మా అమృతంగమయ అనికదా శాస్త్రవచనం. ఇదే వాల్మీకి మరా మరా అంటూ రామతత్త్వాన్ని అందుకోవటం. అందుకొనేసరి కది పరిపాకానికి వచ్చి సంసారమనే వాల్మీకాన్నే భేదించికొని బయటపడ్డాడా మహానుభావుడు. అలా పడటం మూలాన్నే అతడు ప్రాచేతసుడు అనిపించుకొన్నాడు.
వాల్మీకికి ప్రాచేతసుడని కూడా ఒక నామాంతరముందని గదా పేర్కొన్నాము. ప్రచేతసుడు అంటే వరుణుడు. ప్రచేతసుని కుమారుడెవడో వాడు ప్రాచేతసుడు. అంచే వరుణ పుత్రుడని అర్థం. భాగవతాది పురాణాలలో ప్రాచేతసుల వృత్తాంతం వస్తుంది. నారద మహర్షి ప్రాచేతనులకు ఆత్మాజ్ఞానం ఉపదేశించాడని ఉంది. అయితే ఇక్కడ ప్రాచేతసుడంటే మనమా అర్థం చెప్పుకోటానికి లేదు. వరుణుడి పుత్రుడు కాదు వాల్మీకి. వరుణుడొక దేవత. ఈయన ఒక భూలోకవాసి అయిన మహర్షి ఇరువురికి సంబంధమే లేదు. మరి ఎలా వచ్చినట్టీయన కాపేరు.దీన్ని సమర్థించటానికి కొందరొక కొత్త అర్ధం చెబుతున్నారు అదేమంటే వాల్మీకి తండ్రిపేరే అసలు ప్రచేతసుడట. అలాంటి ప్రచేతసుడికి జన్మించిన తనయుడు కాబట్టి ప్రాచేతసుడయినాడట వాల్మీకి. ఇది ఎంతో తెలివిగా చేసిన కల్పన. వాల్మీకి తండ్రి ఎవరో నీకు నాకూ తెలియదు. ఎక్కడా ఏ గ్రంథంలోనూ ఎవరూ చెప్పలేదామాట, మరి వీరికెలా స్వప్నంలో సాక్షాత్కరించిందో మనకు తెలియదు. మహా అయితే ప్రచేతసోహమ్ దశమః అనే మాటొకటి ఉత్తరకాండలో వస్తుంది. ఆప్రచేతసుడెవరో వివరంగా లేదక్కడ అది ప్రక్షిప్తమైన కావచ్చు. చూడబోతే “స్థితస్య గతిశ్చింతనీయా” అన్న సామెతను బట్టి ఏదో ఒక సమాధానం చెప్పాలని అల్లిన ఒక సందర్భమని తోస్తుంది మనకు.
సరేదాని మాటకేమి. అది అభూత కల్పనే అని తోసివేద్దాము. కానీ మన సమస్య సమస్యగానే నిలిచిపోయిందే మరి దీనికి పరిష్కారమేమిటని మరలా ప్రశ్న వస్తుంది. దీనికున్నంతలో నాకు తోచే సమాధాన మొక్కటే. వాల్మీకి తండ్రి ప్రచేతసుడయిన వరుణుడూ కాడు. ఆపేరు గల మరి ఒక పురుషుడూ కాడు. చేతస్సంటే జ్ఞానం. ప్రచేతసుడంటే ప్రకృష్టమైన జ్ఞానం కలవాడని అర్థం. కాగా
Page 24