ఒకవేళ కథ యథాతథంగా జరిగిందని మనం నమ్మకపోయినా దీనిలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైన భావం గోచరిస్తున్నది. అది ఎంతో మనోజ్ఞమైన భావం. వల్మీకమంటే పుట్ట అనే తీసుకోనక్కరలేదు మనం. పుట్ట అంటే అది ఈ సంసారమే. ఇందులో ఉన్నవన్నీ విషసర్పాలే. అంటే విషాదాలూ వేదనలే. ఇవి మనలనన్నప్పుడూ సుఖంగా బ్రతకనీయవు. అనుక్షణమూ కాటువేస్తూనే ఉంటాయి. అయితే వాటినుంచి తప్పించుకొని ఎక్కడికి పోవటానికి లేదు మనం. ఈ వల్మీకంలోనే ఉంటూ ఈ భుజగజాల్ముల విషాగ్ని జ్వాలల ననుభవిస్తూనే మనసునేకాగ్రం చేసి సంసార తారకమైన మంత్రాన్ని నిరంతరం భావన చేస్తూ పోవాలి. పోతే అది కొంత కాలానికొక ప్రబలమైన వజ్రాయుధమై ఈ వల్మీకాన్ని భేదించి మనకీ విషవలయం నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. మన శరీరంకూడా నిజానికొక వల్మీకమే. వలనమంటే చుట్టుకోవటం. చుట్టుకొనేదేదో అది వల్మీకం పరిపూర్ణమైన మన చైతన్యాన్ని చుట్టివేసి ఇది మనలను పరిచ్ఛిన్నులను చేసింది. అది మొదట తమోరూపమైన కారణ శరీరంతో ఆరంభమై క్రమంగా సూక్ష్మమై తరువాత స్థూలమయింది. ఈ త్రివిధ శరీరాలుగా వల్మీకమే మనపాలిటికి. కుండలినీ రూపమైన మనచైతన్యశక్తి దీనిలో ప్రవేశించి అథోముఖంగా నిద్రిస్తున్నది. దీనిని మరలా గురూపదేశ బలంతో మేలుకొలిపితే ఊర్ధ్వముఖంగా పయనించి మన చైతన్యానికి మరలా విముక్తి లభిస్తుంది. అప్పుడీ సంసారమనే పెద్ద వల్మీకంలో మన శరీరమనే చిన్న వల్మీకం చేరి ఉన్నట్టు ఈ రెంటినీ అంటి ముట్టకుండా శుద్ధ చైతన్యరూపులమై వీటిమధ్యనే మనం నిర్లిప్తంగా మెలగుతున్నట్టు ఒక అలౌకికమైన బ్రహ్మానుభూతి కలుగుతుంది మనకు. 'తద్యథా అహినిర్లయనీ వల్మీకే ప్రత్యస్తా మృతాశయితా' అనే ఉపనిషత్సూక్తిలోని రహస్యార్థమిదే.
దీనిని బట్టి వాల్మీకి అనే మాట కిక్కడ సాంకేతికంగా ఒక గొప్ప సాధకుడని అర్థం. అతడు కొంతకాలం సాంసారికమైన రాగద్వేషాలకు గురి అవుతూ బ్రతుకు సాగించి సప్తమహర్షులనే ఆచార్య పురుషుల సాంగత్యం నిమిత్తంగా సాధన మార్గంలో ప్రవేశించాడు. తారకమైన విద్య ఏదో దాన్ని పట్టుకొని కూచున్నాడు. అదే రామమంత్రం. ఆత్మారాముడే రాముడు అంటే ఆత్మస్వరూపమని అర్థం. దానికి సంబంధించిన విద్యే రామతారక విద్య. బ్రహ్మవిద్య. అది మొదట మరామరా అనే రూపంలో ఆరంభమైనా చివరకు రామరూపాన్నే ధరించింది. అందులోనూ అర్థం
Page 23