#


Index

హనుమ ద్విభీషణులు

సీతే. ఈవిడ తన రాకకు సంతోషించి ఆతిధ్యం చేసి వీడొక్కలిపినట్టే ఆవిడా వీడ్కొలుప బోతుంది. ఇలా తరువాత జరుగబోయే ఉదంతానికంతా అద్దం పట్టినట్టుగా ఉందీ కథ. హనుమంతుడు అన్ని అవాంతరాలు అధిగమించి తప్పకుండా సీతను చూసి వస్తాడని చెప్పక చెబుతున్నది. హనుమంతుడి బుద్ధికుశలతా సౌశీల్యముకూడా వ్యక్తమవుతున్న దిందులో. అదే అతనికి విజయాన్ని సాధించి పెడుతుందని కూడా సూచిత మవుతున్నది.

  అనంతరం సంపాతి వృత్తాంతం వస్తుంది. నిర్వేదంతో వానరులంతా ప్రాయోపవేశం చేస్తూ హఠాత్తుగా దర్శనమిచ్చిన ఆగృధ్రరాజాన్ని చూచి భయపడతారు. జటాయువులాగే తమకు మరణం తప్పదనే అనుకొంటాడు. జటాయువర్తనం విని అది వారిని అభిమానించి సీతా వృత్తాంతం తెలియజేస్తుంది. కాని శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటిపోవటానికెవరూ ధైర్యం చూపలేదు. జాంబవంతుడప్పుడు బయట పెడతాడు హనుమంతుడి బలపరాక్రమాలను. అంత వరకూ ఏకాంతంగా మౌనియై కూర్చున్న హనుమంతుడతని మాటలచేత ప్రోత్సాహితుడై బలం పుంజుకొని విజృంభిస్తాడు. పెద్దపెట్టున ఇలా ఘోషిస్తాడు. "భవిష్యతి హిమే రూపం - ప్లవమానస్య సాగరే విష్ణోర్విక్రమ మాణస్య పురా త్రీన్ విక్రమానివ. మారుతస్య సమోవేగే గరుడస్యమోజవే అయుతం యోజనానా నాంతు గమిష్యామితి మేమతిః వాసవస్యసవజ్రస్య – విక్రమ్య సహసాహస్తా దమృతంత దిహానయే” త్రివిక్రముడైన విష్ణువులాగా పెరిగిపోగలను. మారుత గరుత్మంతుల లాంటి వేగం నాది. శతయోజనాలే గాదు. అయుత యోజనాలయినా ఎగురగలను. స్వర్గందాకా ఎగిరిపోయి వాసవుడి చేతిలో ఉండే అమృతకలశాన్ని కూడా అపహరించి తేగలనంటాడు.ఇలాంటి వాడని తెలిసే పంపాడా ప్రభువు. ప్రభువుకు తనమీద ఉన్న ప్రత్యయం కూడా గుర్తించాడా వానరోత్తముడు. ఆకాశానికి లంఘిస్తూ వానరులను చూచి ఇలా అంటాడు. “యాధారాఘవ నిర్ముక్త శ్శరశ్శ్వసన విక్రమః గచ్ఛేత్తద్వర్గ మిష్యామి లంకామ్.”

  రామ ధనుర్ముక్తమైన బాణంలాగా ఎగిరిపోయి లంకమీద వాలుతాడట. హనుమంతుడంటే అప్పటికి రామబాణమే మరేదీ కాదని కవి హృదయం. అంతేకాదు. సీత అక్కడ లేకుంటే స్వర్గానికి వెళ్ళిచూస్తాను. అక్కడ లేకుంటే పాతాళం. అక్కడ

Page 238

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు