మవగమ్యహనూమతి – విదిత్వాహనుమంతంచ - తంసమీక్ష్య - కృతార్థ ఇవసం వృత్తః - దదౌతస్మైతతః. హనుమంతుడంటే ఎవరో తెలిసి అతడి ముఖం బాగా పరకాయించి చూచి తన కార్యం నెరవేరిందనే సంతోషించి ఇచ్చాడట అంగుళీయకం. ఎంతైనా ఉందీ మాటలలో అంతరార్థం. ఉంగరమిచ్చాడంటే మూమూలు వ్యవహారం కాదది. అది తప్పకుండా అతడు సీతకు చేర్చాలి. మరలా ఆ వార్త వచ్చి తనకు చెప్పాలి. ఆవిడ ఏదైనా మరొక అభిజ్ఞానమిస్తే అది తెచ్చి తనకు చేర్చాలి. ఈ రాకపోకలలో ఎన్ని అవాంతరాలైనా రావచ్చు. ఎన్ని ఉపద్రవాలైనా సంభవించవచ్చు. అసలు సముద్రలంఘనం చేయగలగాలి లంకకు వెళ్లాలంటే. అందులో ఎన్ని ప్రమాదాలో. ఆ తరువాత లంకలో ప్రవేశించాలంటే మాటలా. లంకిణి దగ్గరినుంచి ఎంతమంది రాక్షసులు కాపలాకాస్తుంటారో. సీతచుట్టూ ఎందరున్నారో. ఎందరి నెదుర్కొని నిలబడాలో ? మరలా వారి కెవరికీ చిక్కకుండా ప్రాణాలు దక్కించుకొని ఎలా చెక్కుచెదరక తన దగ్గరికి రావాలో వచ్చి అమ్మవారి క్షేమసమాచార మందివ్వాలో మాటలా ఇవి ? ఇదంతా రాముడికి తెలియదనా తెలుసు. తెలిసే విదిత్వా. హనుమంతంతం వీడు హనుమంతుడు గదా తప్పక సాధిస్తాడనే ఇచ్చాడు.
సరిగా భగవానుడెలా అంచనా వేసి ఇచ్చి పంపాడో అలాగే నడుచుకొని ఆయన మెచ్చు వడశాడా భాగవతోత్తముడు. దక్షిణ దిశాభిముఖంగా పయనిస్తుంటే వింధ్య పర్వత ప్రాంతంలో తెలియక వానరులంతా ఒక బిలంలో ప్రవేశించారు. అది స్వయంప్రభ అనే తాపసి కాపలా ఉన్న రహస్యమందిరం హేమ అనే అప్సరస ఇష్టసఖి ఆవిడ. అక్కడ తపస్సు చేస్తూ ఉంది. అది మయుడనే దానవ విశ్వకర్మ నిర్మించి తన ప్రియురాలు హేమ కిచ్చినదట. హనుమంతుడీ విషయమంతా స్వయంప్రభ నడిగి తెలుసుకొంటాడు. అతని మట్టుమర్యాదలకు మాటకారితనానికి స్వామిభక్తికి చాలా మెచ్చుకొంటుంది స్వయంప్రభ. ఆతిధ్యం చేయటమేగాక నిర్గమన మార్గం కూడా చూపి మరలి పోతుంది. మధ్యలో అనుకోకుండా జరిగిన ఈ సన్నివేశం చూస్తే తరువాత రాబోయే లంకా ప్రవేశ వృత్తాంతాన్ని మనకు చక్కగా ధ్వనింప జేస్తున్నది. స్వయంప్రభా మందిరం మందిరంచుట్టూ ఉన్న అద్భుతమైన ఉద్యానవనము లాంటివే అశోకవనంలో భవనము చుట్టూ ఉన్న వనము తపస్సు చేస్తూ కనిపించిన స్వయంప్రభ తరువాత అశోకవనంలో తనకు కనిపించబోయే
Page 237