#


Index

హనుమ ద్విభీషణులు

అప్రమేయ ప్రభావుడాతడని హెచ్చరిస్తాడు. చూడండి. ఎంత ముందాలోచన, ఎంత జాగ్రత్త ఎంత రాజనీతిజ్ఞత, ఎంత స్వామిభక్తి, ఉట్టిపడుతున్నదో ఈ వాక్యాలలో ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు పరమాత్మ.

  అంతేకాదు లక్ష్మణుడు కోపంతో కిష్కింధలో ప్రవేశించినపుడతణ్ణి చూచి సుగ్రీవుడు వణికిపోతుంటే హనుమంతుడిలా మెత్తగా చీవాట్లుపెడతాడు మరలా. చూచావా నీ ఏమరుపాటు ఎంత ఉపద్రవం తెచ్చిపెట్టిందో నేనింకా ముందే నిన్ను హెచ్చరించబట్టి సరిపోయింది. లేకుంటే ఇంకా ముప్పువచ్చి ఉండేది. భయపడకు. సర్వధా ప్రణయాత్రుద్ధోరాఘవః భ్రాతరం సంప్రహితవాన్. ఇంకా వీరు హుషారు పడలేదే అని ప్రణయకుపితుడై పంపి ఉంటాడు లక్ష్మణుణ్ణి నీదగ్గరికి. కృతాపరాధ్యస్యహితే - నాన్యత్పశ్యామ్యహం క్షమం-అంతరేణాంజలిబద్ధ్వా లక్ష్మణస్య ప్రసాదనాత్. నేరం చేసి కూర్చున్నావు కాబట్టి చేతులు రెండూ జోడించి లక్ష్మణుడి కెదురుగా వెళ్లు కోపం చల్లబడుతుంది. రాముడంటే ఏమనుకొన్నావు. అతడు కోపగిస్తే మూడులోకాలు దద్దరిల్లుతాయి. తస్యమూర్ధా ప్రణమ్యత్వం సపుత్ర స్ససుహృజ్జనః - రాజంస్తిష్ఠస్వ సమయే భర్తుర్భార్యేవతద్వశే. తరువాత వెళ్లి సపుత్ర పరివారంగా రామచంద్ర ప్రభువుకు తలవంచి ప్రణామం చేసి భార్యభర్తకు వశమయినట్టుగా అతనికి వశవర్తివై మెలగటం మంచిదంటాడు. చూడండి హనుమంతుని సమయోచిత జ్ఞానం. అందరికన్నా రామతత్త్వమెంత లోతుగా పరిశీలించినవాడో చూడండి ఆ భాగవతోత్తముడు. దాసుని తప్పులు దండంతోసరి. అందుచేత ఆయనకు శరణాగతులం కావటమే తత్ప్రసాదలబ్ధికుపాయం. మన సర్వస్వమూ ఆయన కధీనంచేసి ఆయన కనుచూపులలో మెలగటంకన్నా జీవితం పరమార్థమేమున్నది అన్నాడంటే ఇది పైకి రాజనీతిజ్ఞతగా కనిపిస్తున్నా లోపల అనన్య భక్తికి పరాకాష్ఠగా కూడ దర్శనమిస్తుంది.

  అంతకుముందు జరిగిపోయిన ఈ విషయాలన్నీ కనిపెట్టి చూస్తూ ఆ భక్తుడి యోగ్యత ఇలాంటిదని ఎప్పుడో పసిగట్టాడా పరమాత్మ. అందుకే అందరినీ అన్ని దిశలకూ పంపుతూ హనుమంతుణ్ణి దక్షిణ దిశకు పంపాలని సుగ్రీవుడాలోచించి అతణ్ణి ప్రశంసిస్తుంటే ఇతడే సీతా వృత్తాంతం తెలుసుకొని రాగల సమర్థుడని నిర్ణయించి అతనికే ముద్రికనిచ్చాడు. అక్కడ ఒకమాట ఉంది. తతః కార్యసమాసంగ

Page 236

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు