అర్బుదన్యర్బుదాలు తన ఆజ్ఞానువర్తులై సేవిస్తుంటే దర్జాగా బ్రతికినవాడెలా అయినాడో చూచావా ? రాజదండ మనుభవించి పరిశుద్ధుడై అతడుత్తమ లోకాలకే వెళ్లాడు. అతనికోసం పలవించక కుమారుడంగదుణ్ణి యువరాజును చేసి అతణ్ణి చూస్తూ మనశ్శాంతి పొందవమ్మా అని బోధిస్తాడు. ఇలంటి బోధ భరతుడు తన్ను బలవంతం చేసినప్పుడూ సుగ్రీవుడు భ్రాతృవియోగంతో బాధపడినప్పుడు రాముడు గూడ చేశాడు. సరిగా అలాంటిబోధే ఇది. రాముడి తరువాత రామభక్తుడే ఇలాంటి అధ్యాత్మ విద్యావిశారదుడు పరావరజ్ఞాన పారంగతుడు అని తోస్తుంది. ఇలాంటి జ్ఞానసంపత్తి కొడయడని కూడా కనిపెట్టాడు రాముడతణ్ణి.
పోతే అందరికన్నా ముందుగా మేల్కొని కర్తవ్యాన్ని ఆలోచించే స్వభావముంది హనుమంతుడికి. మిగతా వారే మరి ఉన్నా అతడెప్పుడూ పరాకు చెందడు. ముఖ్యంగా రామకార్యమంటే స్వకార్యమే అతనికి. ఇది కూడా తెలుసు రాముడికి. వర్షర్తువు గడచిపోయినా కామమోహితుడై వానరాంగనలతో క్రీడిస్తూ ప్రమత్తుడయి ఉన్న ప్రభువునిలా హెచ్చరిస్తాడు ఆంజనేయుడు. రాజ్యం ప్రాప్తంయశశ్చైవ - మిత్రాణాం సంగ్రహః శేషః తద్భవాన్ కర్తుమర్హసి. రాజ్యం దక్కింది. యశస్సూ లభించింది నీకు. ఇక నీవు చేయవలసింది మిత్రసంగ్రహమే. కోశము, దండము, మిత్రగణము, తానూ ఇవి నాలుగు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి రాజుకు. మిత్రకార్య మరిందమ క్రియతాం రాఘవస్యైతద్వైదేహ్యాః పరిమార్గణమ్ పరమ మిత్రుడైన శ్రీరాముడి కార్యం నీవు మరిచిపోతున్నావు. సీతా పరిమార్గణానికి వెంటనే ప్రయత్నించు. నచకాలమతీతం తేనివేదయతికాలవిత్ - నహితావద్భవేత్కాలో వ్యతీతః చోదనాదృతే గడువుకాలం గడచిపోతున్నదని తెలిసికూడా ఆయన నిన్ను హెచ్చరించటంలేదు. అతడు హెచ్చరించే లోపలే నీవు మేలుకోవటం మంచిది. ఆలస్యం చేశావో కొంపమునుగుతుంది. కామం ఖలుశరైశ్శక్తః సురాసురమహోరగాన్-వశేదాశరథిః కర్తుంత్వత్ప్ర తిజ్ఞాంతుకాంక్షతే నదేవానచ గంధర్వా నాసురానమరుద్గణా నచయక్షా భయం తస్యకుర్యుః కిముతరాక్షసాః తీక్షమైన బాణాలతోనే సురాసురులందరినీ ఆయన వశపరచుకోగలడు. నీవు శపథం చేశావుగదా. అది పాటిస్తావని ఊరకున్నాడు. అసలు దేవతలుగారు గంధర్వులుగారు యక్షులు గారు, మరుత్తులు గారు, ఎవరూ ఆయన ధాటికి తట్టుకోలేరు. ఇక రాక్షసులనగా ఎంత
Page 235