వేషం ఈ చర్య. సర్వధర్మాన్ పరిత్యజ్య-మామేకమ్ శరణమ్ ప్రజ అన్నట్టు సకలము సన్యసించి నీ పాదాలే శరణ్యమని వచ్చానని భంగ్యంతరంగా చెప్పటమే.
తరువాత వారితో చేసిన సంభాషణలో ఇంకా స్పష్టంగా తేటపడుతుందీ భావం. పద్మపత్రేక్షణ్ వీరౌ-జటామండల ధారిణా శక్రచాపని భేచాపే - గృహీత్వా శత్రుసూదనౌ. కమల పత్రాక్షుడవు నీవు జడలెందుకు ధరించినట్టు. జడలు ధరించినవాడవు మరలా ఈ ధనుర్బాణాలేమిటి చేతిలో. దేవలోకాదివాగతౌ మానుషౌ దేవరూపిణె. దేవలోకం నుంచి వచ్చిన మానవులో. మానవులుగా జన్మించిన దేవతలో మీరు. ఉభౌయోగ్యావహం మన్యే - రక్షితుంపృథివీమిమామ్. మీ ఇద్దరినీ చూస్తే ఈ భూమండలాన్నంతా కాపాడటానికి దగిన సామర్థ్యమున్న వాళ్లుగా కనిపిస్తున్నారు. ఎంత సాభిప్రాయమైన మాటలో చూడండి ఇవి. పైకి కనిపిస్తున్న మూర్తిని చూచి పలికిన మాటలు కావివి. హృదయకుహరమధ్యంలో తోచే ఆధ్యాత్మ మూర్తిని చూచి. కనుకనే ఈ మూర్తి నాశ్రయిస్తే సుగ్రీవుడి కార్యం తప్పక నెరవేరుతుందని గ్రహించాడు. సుగ్రీవుడు తమ సఖ్యం కోరుతున్నాడు. అనుగ్రహించమని కోరుతాడు. ఏవముక్త్వావాక్యజ్ఞావాక్యకుశలః పునర్నోవాచకించన వారు వాక్యజ్ఞులు గనుక తన వాక్య కుశలతను ఈ పాటికి గ్రహించి ఉంటారని మరి మాట్లాడకుండా మౌనం వహించాడట.
సేవకుణ్ణి మించిన వాడా స్వామి. నేనింతగా మిమ్ము ప్రశ్నిస్తుంటే మీరేమీ మాట్లాడరేమని అతడంటే నీ సంగతి నాకు తెలియకుంటే గదటోయి. ఎప్పుడో తెలుసు నీ గొప్పతనం నాకు. నానృగ్వేదవినీతస్య-నాయజుర్వేద ధారిణః నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుమ్ ఋగ్యజురాదులైన నాలుగువేదాలు, నవవ్యాకరణాలు వల్లించిన వాడుగాని ఇలా మాట్లాడలేడు. ఒక్క అపశబ్దం దొర్లలేదు గదా ఇంతసేపు మాట్లాడినా ఆవిస్త రమసందిగ్ధమ్ - సంస్కార క్రమసంపన్నమ్. ఎంత సంస్కారవంతమైన మధురమైన భాషణ ఇది. ఇలాంటి భాషణ వింటే ఎవరి మనసుకు తోషణ కలగదు. ఇలాంటి మహనీయుడు దూతగా అమాత్యుడుగా ఉంటే ఎవరి కార్యాలు ఫలించవు అని తమ్ముణ్ణి చూచి అన్యాపదేశంగా ప్రశంసిస్తాడు. ఒక్క నాలుగు మాటలు మాట్లాడాడో లేదో హనుమంతుడు సకలవేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు ఇన్నింటి జ్ఞానమతని కున్నట్టు ఎలా గ్రహించాడు రాముడు. క్రొత్తగా
Page 232