లేకపోయినా అలాంటి కష్టమైన పనికైనా ఒడిగట్టాడు. ఆ తరువాత అన్న తన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలని పట్టణంనుంచి నిర్దయంగా వెళ్లగొడితే ఎవరికీ కనపడకుండా వెళ్లిపోయాడు. ఇంత భ్రాతృప్రేమ, భ్రాతృ కార్యనిర్వహణా మానవచరిత్రలోనే చూడబోము.
నిజానికాయన ఈయనకు భ్రాతకాడు. ఈయన ఆయనకు కాడు. భ్రాతలనే పాత్రలు రెండూ ఇవి రెండు ఛాయాచిత్రాలు. రెండూ ఛాయలే కాని యధార్థంకావు. యధార్థం రాముడు శుద్ధమైన జ్ఞానమైతే లక్ష్మణుడు దాని నాశ్రయించిన ప్రాణం. జ్ఞానమనేది పరమాత్మ స్వరూపమైతే - ప్రాణశక్తి ఆ స్వరూపాన్ని బయటపెట్టే లక్షణం. దాని క్రియాశక్తి ఇది. నిష్క్రియమైన భగవానుడి సంకల్పాన్ని అనుసరించి లోకంలో ఆయన చేయవలసిన క్రియలన్నీ ఇదే నిర్వహించవలసి ఉంది. భగవత్సంకల్ప మేమిటంతకూ దుష్టశిక్షణ శిష్టరక్షణ. అందుకోసమే రామావతారం. అది నెరవేరాలంటే క్రియాశక్తి అనుక్షణమూ పనిచేస్తూనే ఉండాలి. ఎంతవరకు భగవానుడు లోకంలో అవతరించి ఆ అవతార ప్రయోజనం నెరవేరేవరకూ అది బాలలో విశ్వామిత్రుడితో బయలుదేరి వెళ్లటంతో ఆరంభమయింది. ఉత్తరలో సీతా పరిత్యాగంతో సమాప్తమయింది. ఈ రెండు తటాలనూ తాకుతూ ప్రవహించిన క్రియాప్రవాహమెంత ఉన్నదో అది ఎన్ని మలుపులు తిరుగుతూ ప్రవహిస్తూ వచ్చిందో దానికంతా నిర్వాహకమైన శక్తి లక్ష్మణుడే. రాముడు సాక్షి. లక్ష్మణుడు కర్త. క్రియాశక్తి అన్నప్పుడదేగదా కర్తృత్వం వహించవలసింది.
అయితే ఈ కర్తృత్వం వెనుక ఒక సంకల్పంకూడా ఉండాలి. కర్త ప్రాణమైతే సంకల్పం మనస్సు. ఈ మనస్సే భరతుడు. ప్రాణమే లక్ష్మణుడు. ఒకటి చక్రం. మరొకటి శంఖం. ప్రాణవాయువుతో ఊదేది నాదం పలికేదే గదా శంఖమంటే. అందుకే అది ప్రాణసంకేతం. పంచప్రాణాలతో కూడిన పాంచజన్యం. పోతే దాని తోబుట్టువు సుదర్శనం. సంకల్పరూపం, సత్యసంకల్పుడైన పరమాత్మ సంకల్పం గదా అది. సుదర్శనం కాక మరేమవుతుంది. సుదర్శనమై అది శత్రుఘ్న బలంతో ధర్మరక్షణ చేస్తుంటే, తన లక్షణమైన లక్ష్మణుడనే ప్రాణశక్తితో భూమండలమంతా పరిభ్రమించి ఎక్కడెక్కడి అసుర దుష్టశక్తులనూ రూపుమాపి అధర్మశిక్షణ జరపటమే రామవేషంలో అవతరించిన పరమాత్మ సాధించిన ప్రయోజనం. తన్మహాయజ్ఞాధి
Page 227