#


Index

భరత లక్షణులు

జానామికుండలే నూపురేత్వభిజానామి - నిత్యం పాదాభివందనాత్ - అన్నయ్యా !

  నేనీ అంగదములు గుర్తించలేను, కుండలములు గుర్తించలేను. కాని నూపురములు మాత్రం వదినగారివేనని గుర్తు పట్టగలను. ఎందుకంటే నిత్యమూ పాదాభివందనం చేస్తుంటాను కాబట్టి. ఎంత మహోన్నతమైన ప్రసంగమో చూడండి ఇది. ఇది ఒక్కటిచాలు ఆ మహనీయుడి ఉదాత్తతను లోకానికి చాటటానికి. ఇది రాముడి అంతరాత్మ కెంత తెలియాలో అంతగా తెలుసు. అందుకే సీత నెప్పుడు ఒంటరిగా విడిచి వెళ్లాలన్నా లక్ష్మణుణ్ణి కాపలా ఉంచి వెళ్లేవాడు. చివరకు సీత అనరాని మాటలని దండిస్తే వచ్చానని అతడు చెప్పినా ఆవిడ తెలియక అంటే మాత్రం నీవు నా ఆజ్ఞ పాటించక కోపంతో తొందరపడి ఎందుకిలా వచ్చావని మందలిస్తాడు. అంత విశ్వాస మా తమ్ముడి మీద అలాంటి తమ్ముడు రావణ ప్రయుక్త శక్తిపాతంచేత నిరుచ్చ్వాసుడై రణభూమిలో పడిపోయినప్పుడు పరితాపం పట్టలేక ఇలా వాపోతాడు. దేశేదేశేకళత్రాణి - దేశేదేశేచ బాంధవాః తంతుదేశం నపశ్యామి - యత్రభ్రాతా సహోదరః - భార్య అయినా దొరుకుతుందిగాని బంధువులైనా దొరుకుతారు గాని ఇలాంటి తమ్ముడు నాకెక్కడ దొరుకుతాడంటాడు. అప్పటికి సీత కన్నా ప్రీతిపాత్రు డాయనకు లక్ష్మణుడన్నమాట.

  అన్నదమ్ముల మధ్య ఇలాంటి అన్యోన్యత ఉండబట్టే కథ అంతా వారిద్దరి మధ్యే జరిగింది. అన్న చెప్పటం, తమ్ముడు చేయటం. అది మంచి అయినా సరే. చెడ్డ అయినా సరే. తన మనసుకిష్టమైనా సరే. కాకున్నా సరే. రాముడు చెప్పినపని ఏదైనా సరే. తాను కాదనరాదు. చేసి తీరవలసిందే. ఆయనగారి ఆరం భారం సర్వమూ తన భుజస్కంధాలమీద వేసుకుని తన తలపైన మోసుకొని తిరిగాడు లక్ష్మణుడు తన జీవితాంతము పుట్టింది మొదలు ఆయనను వదిలి పెట్టి వెళ్లిపోయినదాకా తన పని అంటూలేదు లక్ష్మణుడికంతా ఆయన పనే. బాల్యంలో అన్నతో కలిసి వెళ్లాడు. అయోధ్యలో అన్నతోనే తమ వాళ్లకు దూరమయ్యాడు. అరణ్యంలో అన్న వదినలతోనే కష్టసుఖాలనుభవించాడు. కిష్కింధలో ఆయనతోనే కలిసి అందరినీ ఆశ్రయించాడు. సుందరలో ఆయనతోపాటే శుభవార్త కోసం ప్రతీక్షించాడు. యుద్ధభూమిలో ఆయనకు కుడిభుజంలాగా విజృంభించాడు. తుదకు ఉత్తరలో ఆయన వదినెగారిని అడవిలో విడిచి రమ్మని ఆజ్ఞాపిస్తే తన కిష్టం

Page 226

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు