#


Index

భరత లక్షణులు

తండ్రి అయినా సోదరులైనా అందరూ అతని పాలిటికన్న వదినెలే. మరెవరూ కారు. వారికి సేవ చేయటమే తన జన్మకు చరితార్ధతగా భావించాడా మహానుభావుడు. సీతారాములతో అరణ్యానికి వెళ్ళేటప్పుడు తల్లి సుమిత్ర అతణ్ణి సాగనంపుతూ ఒక మాట అంటుంది. రామందశరథంవిద్ధి - మాంవిద్ధిజనకాత్మజామ్ అయోధ్యామటవీంవిద్ధి - గచ్ఛతాతయథాసుఖమ్ రాముణ్ణి దశరథుడనుకో. సీతను చూచినప్పుడల్లా ఆవిడ నేనే అనుకో. మరి ఆ అరణ్యమేదో కాదు. అయోధ్యేననుకో. ఇక వెళ్ళిరా నాయనా సుఖంగా నని ఆశీర్వదిస్తుంది. ఇందులో ఎంత అంతరార్ధముందో దానికంతటికీ ఉదాహరణ ప్రాయమే ఆయన జీవితం. నిజంగా తల్లి తండ్రి అనే భావించాడు. అలాగే చూచాడు సీతారాములనిద్దరినీ లక్ష్మణుడు. కనుకనే వారిని విడిచి నిముషమైన నిలవలేకపోయాడు. చిన్నప్పటి నుంచి అంటిపెట్టుకొనే ఉన్నాడు రాముణ్ణి. విశ్వామిత్రుడు రాముణ్ణి పంపమన్నాడేగాని లక్ష్మణుణ్ణి కాదు. అయినా ఆయనతోనే వెళ్లాడు. పెండ్లి చేసుకొని మరలా ఆయనతోపాటే అయోధ్యకు వచ్చాడు. అభిషేక భంగమయి అరణ్యాలకు పోతుంటే నేనూ వస్తానని ఆయనతోనే బయలుదేరుతాడు. మిగతా సోదరులెవరు బయలుదేరారు? తాను బయలుదేరాడు. తన్ను పొమ్మని ఎవరూ అనలేదుగదా ఎందుకా సంరంభం. అతడి స్వభావమలాంటిది. అన్నను విడిచి ఉండలేడు అంతకు ముందొకడైతే ఇప్పుడిద్దరు వారు. అన్నవదినె. ఇద్దరూ తనకారాధ్యులే. అవినాభావ జీవనులే. అందుకే 'నదేవ లోకాక్రమణం - నామరత్వమహంవృణే - ఐశ్వర్యం వాపి లోకానాం కామయేనత్వ యావినా' నీవు లేకుండా నాకు స్వర్గంగాని ఎలాంటి ఐశ్వర్యంగాని సమ్మతంకాదు. ధనుర్ధారుజ్జె నీకు మార్గం చూపుతూ ముందు నడుస్తాను. అడవిలో నీకు ఫలమూలాదులు తెచ్చి ఇస్తాను. వదినెగారితో నీవు సుఖంగా ఉంటే పగలు, రాత్రి నీకు పరిచర్య చేస్తూ బ్రతుకుతానని బ్రతిమాలి వెళ్లుతాడు వారి వెంట.

  సుమిత్ర చెప్పినట్టుగా ఆ తల్లిదండ్రులుగానే భావించి సేవించాడు వారిని. సీత తొందరపడి ఆయన శీలాన్ని శంకించిందేగాని నిప్పులాంటి శీల మాయనది. అది కిష్కింధలో మనకు నిదర్శనమవుతుంది. సీత మూటగట్టి పడవేసిన సొమ్ములన్నీ తెచ్చి వానరులు రాముడిముందు పెట్టినప్పుడాయన వాటిని చూడలేక లక్ష్మణుణ్ణి చూడమని చెబితే లక్ష్మణుడిలా అంటాడు. నాహం జానామికేయూరే - నాహం

Page 225

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు