#


Index

భరత లక్షణులు

మామహాత్ము డరణ్యానికి వస్తే మనలను హత్య చేయటానికే వచ్చాడీ దుర్మార్గుడితని ప్రాణాలు తీస్తానని లేస్తాడు. ఇలాంటి అనుమానాలు అపోహలు తొందరపాటు ఎక్కువగా కనిపిస్తుంది లక్ష్మణుడిలో. ఎదుటివారేమీ అనకుండానే ఇలాంటి ఆవేశం కనపరిచే వ్యక్తి ఎవరైనా ఒక మాట అంటే ఇక పడగలడా ? అలాంటి సంఘటన కూడా ఏర్పడిందాయన జీవితంలో దురదృష్టవశాత్తూ రాముడాపదలో చిక్కినా ఆదుకోవటానికి వెళ్లలేదని సీత ఆయనను నానా దుర్భాషలాడింది. ఆఖరుకు నామీది వ్యామోహంతో నీవు కదలకుండా ఉన్నావు దుర్మార్గుడా నేను ఉరివేసుకొని చావనైనా చస్తానుగాని నీకు దక్కను సుమా అని చాలా కర్కశమైన మాటకూడా ఆవిడ నోట వచ్చింది. తనకున్న తొందరపాటే ఆవిడకూ. అది దైవమే ఆవిడ ముఖంగా అతడికి పాఠం చెప్పించి ఉంటుంది. సందేహంలేదు. అమాయకుడూ, ధర్మనిరతుడూ అయిన భరతుణ్ణి తాను అన్న మాట ఊరకపోతుందా ? బెడిసి కొట్టదా ? అలాగే జరిగింది.

  లక్ష్మణుడింత కోపిష్టి అయినా ఒక సుగుణమున్నది. ఎంత తొందరగా కోపపడుతాడో అంతగా పశ్చాత్తాప పడతాడా మహాత్ముడు. అది ఒక గొప్పగుణం. కైకనూ దశరథుజ్జీ, భరతుణ్ణి ఎంతగానో నిందించినవాడు రాముడలా మాట్లాడకూడదు పనికిరాదని నచ్చజెప్పగానే చప్పబడిపోయాడు. భరతుణ్ణి చంపుతానని పైకి లేచినవాడు రాముడు చీవాట్లు పెట్టగానే తన తప్పు తెలుసుకొని సిగ్గుతో తలవంచుకొంటాడు. అప్పటి నుంచీ భరతుడి గుణగణాలు బ్రహ్మాండంగా ప్రశంసిస్తూ పోతాడు. సుగ్రీవుడికి బుద్ధి చెబుతానని బుసలు కొడుతూ కిష్కింధలో ప్రవేశించినవాడు తార అను నయవాక్యాలు వినగానే చల్లారిపోతాడు. వదినగారి పరుషోక్తుల కుద్రిక్తుడయి రాముడి దగ్గరకు పరిగెత్తిపోయిన వాడాయన ఒకవేళ తెలియక ఆడది నిష్టూరమాడితే అన్నీ తెలిసి నీవిలా ఎందుకు చేశావని అడిగితే నిరుత్తరుడై నిలుచుంటాడు. తాత్కాలికమైన కోపోద్రేకానికి గురి అయినా ఇలాంటి పశ్చాత్తాప గుణమెంతో ఉంది లక్ష్మణుడిలో పశ్చాత్తాపమేగదా పరిశుద్ధి హేతువు.

  పరిశుద్ధి అంటే అలాంటి ఇలాంటి పరిశుద్ధికాదు లక్ష్మణుడిది. అంత చిత్తశుద్ధి గల వ్యక్తి మరొకడు లేడు. వికారహేతౌ సతివిక్రియంతే అన్నట్టు ఒక సందర్భమేర్పడినప్పుడే బయటపడుతుంది మానవుడి సౌశీల్యం. అది లక్ష్మణుడి కాజన్మ సిద్ధమైన గుణం. అన్న వదినెలంటే అతనికున్న భక్తి ఎవరికీలేదు. తల్లి అయినా

Page 224

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు