భరతుడికి వచ్చింది ఇలాంటి కోపం తల్లిమీద. అతని కావిడ మీద రావటం సబబైనది కూడా. తనకోసం తల్లి తననడగకుండా ఒక దుర్మార్గం చేసింది. అదీ తన అన్న విషయంలోనే. అలాంటప్పుడు కూడా అతడావిడను చంపుతాను చేస్తానన లేదు. ఎంత చెడ్డా తల్లి గనుక అలాంటి మాట నాలాంటి వాడనుకోవలసింది కాదని తనకు తానే సమాధానం చెప్పుకొంటాడు. అది మనోధర్మం. ఇక్కడ అదికాదు. ఇది ప్రాణధర్మం. కనుక కోపపడటమే గాని దానికి సమాధానం లేదు. శూర్పణఖను రాముడు విరూపను చేయమన్నాడంతే. వెంటనే ఉదృత్య ఖడ్గం చిచ్ఛేద - కర్ణనాసమ్ దాని ముక్కు చెవులు కోసి పంపాడు. సుగ్రీవుడు రామకార్యం స్మరించకుండా స్మరకేళీ వినోదాలతో ప్రమత్తుడయి ఉంటే అతడిని హెచ్చరించటానికి వచ్చినప్పుడు కూడా ఇంతే. నిశ్వసంతం తుతందృష్ట్వా బభూపుర్హరయస్తత్థాః కాలసర్పంలాగా బుసకొడుతున్న లక్ష్మణుణ్ణి చూచి హడలిపోయారట వానరులు. దగ్గరికి రావటానికి దమ్ములేదట ఒకడికీ. చకారజ్యాస్వనం వీరో - దిశః శబ్దేన పూరయన్ - అసలే వాళ్ళు బెదిరిపోతుంటే ధనుష్టంకారం చేసి మరీ బెదరగొడతాడు. సుగ్రీవుడు గూడా భయంతో వణుకుతూ ఆయనగారి కోపాగ్ని చల్లారేలాగా చల్లని మాటలు చెప్పి రమ్మని తారను పంపవలసి వచ్చింది. ఆడదాని ముఖం చూచి కొంత మెత్తబడతాడా ఆగ్రహోదగ్రుడు. ఇలాంటి వాడికిక ఇంద్రజిదాది రాక్షస వీరులతో రణరంగమేర్పడితే చెప్పేదేముంది. ఇంద్రజిత్తుకే జిత్తనిపించాడు.
ఒక వ్యక్తిమీద అభిమాన మెక్కువగా పెంచుకొన్నప్పుడతని కెవరు కీడు చేసినా కోపమేగాదు. చేయకపోయినా చేస్తారేమోననే అనుమానం కూడా ఉండటమొక స్వభావం. తాను తప్ప మరి ఒకరెవరూ అతనికి హితైషులు కారనే అహంకారం కూడా మిళితమై ఉంటుంది అందులో. దానితో అనవసరంగా రెచ్చిపోయి ఆస్థాన సంరంభం చూపటంకూడా సహజమే. ఇలాంటి సంరంభమే చూపాడు భరతుడి విషయంలో. అదీ రెండుసార్లు. మొదటిసారి అయోధ్యలో. రెండవసారి అరణ్యంలో. రాముడి అభిషేకం ఆగిపోయింది కైక మూలంగా. భరతుడికందులో ప్రమేయమేలేదు. అతడే కర్మా ఎరగడు. ఎక్కడో తాతగారి ఇంట్లో దూరంగా పడి ఉన్నాడు. అలాంటివాణ్ణి పట్టుకొని చంపుతాను కొడతానని లేస్తాడు లక్ష్మణుడు. అతణ్ణి కాక అతడి పక్షీయులనందరినీ శిక్షిస్తానంటాడు. అలాగే తరువాత రామ ప్రత్యానయనార్థ
Page 223