వెళ్లిపోదామంటాడు. చూడండి ఆ ధర్మదృష్టి స్వార్థత్యాగమూ భగవత్పాద భక్తీ ఏ మానవుడి మనసుకైనా ఉండవలసిన అలవరచుకోవలసిన సద్గుణాలివే కదా ! అదే మనకు భరత పాత్రాపదేశంలో ఉపేదేశిస్తున్నాడు మహర్షి భరతుడంటే మానసమే. అది మానసంలాగా నిత్యనిర్మలం. భగవద్దత్తమై భగవదంకితమైన మానసమనేది ఎంత ఉత్తమమో ఉదాత్తమో చూడాలంటే సకలగుణ భరితుడైన భరతుడే మన కాదర్శచరితుడు.
భరతుడి తరువాత చెప్పుకోదగిన రామానుజుడు లక్ష్మణుడు. లక్ష్మణుడు రామానుజుడైతే రాముడు లక్ష్మణ పూర్వజుడన్నాడొకచోట వాల్మీకి చమత్కారంగా. వారిద్దరికీ అలాంటి అవినాభావం. ప్రాణచైతన్యాలు గదా రెండూ. చైతన్యం స్థితి ప్రాణం దాని గతి. గతిలేని స్థితిలేదు. స్థితిలేని గతిలేదు. మనసునైనా వదలి ఉండగలదుగాని చైతన్యం ప్రాణవృత్తిని విడిచి ఉండలేదు. ఉండటమంటేనే ప్రాణమసలు. అందుకే మనోరూపుడైన భరతుడయోధ్యలో దూరంగా ఉన్నా ప్రాణప్రతీకమైన లక్ష్మణుడలా లేడు. నిత్యమూ పరమాత్మ నంటి పట్టుకొనేఉన్నాడు. బహిశ్చరః ప్రాణః అని అసలు మొదటనే ధ్వనింపజేశాడా రహస్యం మహాకవి. పరమాత్మ శేషి అయితే లక్ష్మణుడు శేషుడు. శేషుడంటే ఆదిశేషుడు. ఆదిశేషుడంటే ప్రాణమే. సర్పం ప్రాణానికి సంకేతం. అదే మన శరీరంలో కుండలినీశక్తి. ఇది అనుక్షణమూ జాగరూకమై ఉంటుంది మన శరీరంలో. మిగతా ఇంద్రియ వృత్తులూ, చివరకు మనోవృత్తి అయినా లయం కావచ్చు గాని ఇది లయం కావటానికి లేదు. నిత్యజాగరణ శీలమిది. ప్రాణంకూడా లయమైతే అది మరణం. జగత్తుకంతా లయమైతేఅది ప్రళయం. అప్పుడూ అది పూర్తిగా లయంకాదు. పరమాత్మలో చేరి ఆచైతన్యంతో ఓతప్రోతమై ఉంటుంది.
ఇదే లక్ష్మణుడి జీవితం. రాముడు పరమాత్మ అయితే ఆయన లక్ష్మ లేదా లక్షణమిది. లక్షయతీతి లక్షణమ్. ఆయన స్థితిని సూచించేదని అర్థం. అలా సూచించాలంటే నిత్యమూ ఆయననంటి పట్టుకొని ఉండాలిసిందే. లయమై పోకుండా జాగరూకమై ఉండవలసిందే. లయానికి మారు పేరే నిద్ర. నిద్రాస్వరూపిణే ఊర్మిళ. అందుకే ఆవిడ నయోధ్యలో ఎక్కడో దూరంగా వదిలేసి తాను రాముడి వెంట వెళ్లిపోయాడు. అంటే నిద్రావృత్తిని దూరం చేసుకొని రామసేవలో నిర్ణిద్రుడయ్యాడని
Page 221