ఎవరి మనసు మార్చదు అంటాడు. అయితే అన్న పెట్టిన ఈ పరీక్షలో నూటికి నూరు మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు భరతుడు. అయోధ్యకు క్రోశమాత్రదూరంలో ధర్మమివ ధర్మజ్ఞం దేహవంతమివా పరం. ధర్మమే మరొక అవతారమెత్తినట్లున్న భరతుణ్ణి చూచి ఆంజనేయుడు రాముని రాక నివేదించగానే నాయనా ! నీవు మానవమాత్రుడవా లేక దేవతవా ? నా మీద అనుగ్రహంతో వచ్చి ఇంత గొప్ప శుభవార్త చెవిలో వేశావిన్నాళ్లకు. 'కళ్యాణీ బత గాధేయమ్, లౌకికీ ప్రతిభాతిమే ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి' లోకంలో నలుగురూ చెప్పుకొనే ఈ సామెత ఎంతమంచి సామెతో గదా. మానవుడు బ్రతికి ఉండాలేగాని నూరేండ్ల తరువాత కూడా ఒక మంచి మాట వినవచ్చునంటాడు. రామాయణంలోని జ్యోతిశ్శిఖరాల లాంటి పదిశ్లోకాలలో ఇది ఒక శిఖరం. తరువాత రాముణ్ణి పోయి కలుసుకొని ఆయన మన్ననలన్నీ పొంది సుగ్రీవాదులను పరిచయం చేస్తే అతనితో ఇలా అంటాడు. అది ఒక జ్యోతిఃశిఖరమే. త్వమస్మాకం చతుర్ణాంతు-భ్రాతా సుగ్రీవపంచమః - సౌహృదాద్ జ్ఞాయతే మిత్ర మపకారో రిలక్షణమ్ - సుగ్రీవా నీవు మా నలుగురన్న దమ్ములకూ అదనంగా అయిదవవాడవు. సౌహృదంవల్లనే గదా మిత్రుడనే వాడేర్పడుతాడు. అది లేకపోతే వాడే శత్రువు. భరతుడి భావశుద్ధి, ఋజుబుద్ధి అంతా ఈ వాక్యాలలో గుంభితమయి కనిపిస్తాయి.
పోతే రామాభిషేకానంతరం ఆతరువాత సీతా లక్ష్మణ పరిత్యాగమయి ఇక రాముడు నిర్యాణమైపోయేదాక భరతుడెక్కడా ఎప్పుడూ నోరు దెరచి మాట్లాడినట్టే లేదు. చివరికిక రాముడు వెళ్లిపోతూ పోతూ పెట్టాడొక పరీక్ష మళ్లీ భరతుడికి. దానికి కూడా తట్టుకొని నిలబడతాడా మహానుభావుడు. అద్యరాజ్యే భిషేక్ష్యామి భరతం ధర్మవత్సలం - తతో యాస్యామ్యహంవనమ్ ఇక ఎవరున్నారు పెద్దవాళ్లు. లక్ష్మణుడా లేడు నేనా వెళ్లిపోతున్నాను. కనుక భరతుడికే పట్టాభిషేకం చేయదలచానంటాడు రాముడు. దానికి భరతుడిచ్చిన జవాబేమిటో తెలుసా ? నీవు లేకుండా నాకు స్వర్గరాజ్యమైనా అక్కరలేదు సుమా. సత్యేనాహం శపిరాజన్ -ఇది ఒట్టు. అంతగా కావలసివస్తే ఇమేకుశలవారాజ - న్నభిషించనరాధిప కోసలేషు కుశంవీర - ముత్తరేషు - తథాలవమ్ ఈ కుశలవులున్నారు గదా. వీరిద్దరిలో కుశుణ్ణి కోసలానికి లవుణ్ణి ఉత్తరకోసలానికి అభిషిక్తులను చేసి మనమిద్దరమూ
Page 220