ఎవడుల్లంఘించగలడు. అలాంటివాడెవడైనా ఉంటే శిక్షకు పాత్రుడే. మేమా భరతుడి ఆజ్ఞానువర్తులం. మాలాంటి వారనేకులున్నారాయన ఆజ్ఞ పాలించే క్షత్రియులు. తప్పక నిన్ను నేను దండించగలనంటాడు. చూడండి. రాముడి ఈ మాటల్లో భరతుడి రాజ్యపాలన అంటే ఏమిటో అది ఎలాంటిదో.
ఇంత నమ్మినబంటు గనుకనే భరతుడంటే రాముడికంత వాత్సల్యం. అభిమానం. ఆయన మాటలు విని తాము చూడకపోయినా సుగ్రీవహనుమ ద్విభీషణాదులకు కూడా ఆయనంటే ఎంతో గౌరవం. వారికే అంత గౌరవమైతే రాముడికెంత అనురాగమో ఇక వర్ణించనలవి గాదు. దగ్గర ఉన్న లక్ష్మణుడికన్నా దూరంగా తనకోస మెదురుచూస్తున్న భరతుడే మిన్న రాముడికి. రావణవధానంతరం పట్టణానికి తిరిగి రావాలని వేగిరపడుతుంటాడు రాముడు. అంత వేగిర మేటికి మా ఆతిథ్యం స్వీకరించి రెండు రోజులు విశ్రాంతి తీసుకొని వెళ్లవచ్చు గదా అని బ్రతిమాలుతాడు విభీషణుడు. రాముడతణ్ణి చూచి ఇలా అంటాడు. నమేస్నానమ్ బహుమతం – వస్త్రాణ్యాభరణానిచ - ఇతి ఏవపథాక్షిప్రం - ప్రతిగచ్ఛామితాంపురీం - నాకు స్నానమక్కరలేదు. మరేదీ అక్కరలేదు ఇక్కడ నుంచే ఉన్న పళంగా బయలుదేరి వెళ్లాలి. తంవినాకై కేయీపుత్రం భరతం ధర్మచారిణం - భరతుణ్ణి చూచేదాకా నాకు శాంతిలేదు. సుతామ్యతి ధర్మాత్మా - మమహేతోః - నాకోసం ఎంత పరితపిస్తుంటాడో ఈ పాటికని పలకరిస్తాడు. అన్నచేత ఇంత ప్రశంస పొందిన ఆ తమ్ముని జీవితమెంత ధన్యం. అన్న అంటే ఆయన కేవలమన్నగాదు గదా. అన్నగా నటించే పరమాత్మే ఆయె. మరితానో ఆ పరమాత్మ నిర్మలమైన మానసమే ఆయె. అది సుదర్శనమేగాని కుదర్శనమెలా అవుతుంది.
అది ఎప్పుడూ ఎలాంటి దశలో కూడా సుదర్శనమేనని తనకు తెలిసినా లోకానికి తెలపాలి పరమాత్మ. అందుకే తనరాక ముందుగా తెలిపి రమ్మని హనుమంతుని పంపుతూ ఏతచ్ఛుత్వాయమాకారం భజతే భరతస్తదా-సచతేవేదితవ్యః స్యాత్ నేను మరలి వచ్చానని వార్తవిని, అతడెలా మారిపోతాడో కనిపెట్టు - తత్త్వేన ముఖవర్ణేన - దృష్ట్యావ్యాభాషణేనచ ముఖకవళిక - మాటలు చేష్టలు ఎలా ఉంటాయో తెలుసుకో. అతడు రాజ్యంమీద కోరిక కనబరిస్తే అలాగే చేయనీ రాజ్యం. పితృపైతామ హంరాజ్యం - కస్యనావర్తయేన్మనః కులక్రమాగతంగా వచ్చి ఒళ్లోబడ్డ రాజ్యభోగం
Page 219