మెచ్చుకొని తీరవలసిందే ఆయన సచ్చరిత్ర. ఎంత పట్టుదలగాకపోతే బందు పరివార సేనామాత్య పురోహిత పౌరజానపదులతో సహా పట్టణాన్నంతా కదిలించి రామపాద సన్నిధికి చేర్చి ఆయనను మరలా వచ్చి పట్టాభిషేకం చేసుకొంటేనే కాని కాదని పట్టుపడతాడు. ఎంతగానో బ్రతిమాలి ఎంతో హేతువాదం చేసి చివరకాయన అన్నిటికన్నా బదులు చెప్పి నిరుత్తరుణ్ణి చేస్తే అప్పటికీ పట్టు వదలలేదు భరతుడు. అధిరోహార్యపాదాభ్యాం - పాదుకేహేమభూషితే - ఏతేహిసర్వలోకస్య – యోగక్షేమం విధ్యాస్యతః ఇదుగో నీ ఈ పాదుకలు పాదాలకు ధరించి ఆ తరువాత వాటిని నాకు ప్రసాదించమని ఆయన అలా చేసి ఇచ్చేవరకు విడిచిపెట్టలేదు తనపట్టు.
రామపాదుకలంటే ఏమిటో తెలుసు భరతుడికి. అవి లోకానికంతా
యోగక్షేమాన్ని ఆపాదించేవట ఆ పాదుకలు. యోగక్షేమం వహామ్యహమ్ అన్నాడు.
భగవానుడు. ఎప్పుడు ? అనన్యాశ్చింతయంతోమామ్ అనన్యమనస్కులై తన్ను
చింతించినప్పుడు ఏమిటా చింతించవలసింది. భగవద్రూపాన్ని. ఎక్కడ ఉందది.
ఇక్కడే ఉంది. ఈ విశ్వమే అది. అంతా ఆయన విభూతే. విశ్వమంటే నామరూపాలే
గదా. నామరూపాలే అప్పటికాయన పాదుకలు. పాదోస్యవిశ్వాభూతాని అని గదా
వేదవచనం. ఈ పాదుకలలోనే ఆయన మూర్తిని దర్శించాలి మానవుడు. అదే
మనజీవిత రాజ్యాన్నంతటినీ ఒడుదుడుకులు లేకుండా పాలిస్తుంది. కంటికి రెప్పలా
కాపాడుతుంది. అందుకే వాటిని భక్తిశ్రద్దలతో మోసుకొని పోయాడు భరతుడు.
భగవద్విభూతిని భరించాడు గనుకనే భరతుడు. తత్ప్రభావంతో రాజ్యాన్ని భరించాడు
గనుక కూడా భరతుడే. 'భరతశ్శాసనం సర్వం - పాదుకాభ్యాం న్యవేదయత్
తదధీనస్త దారాజ్యం కారయామాస సర్వదా.' భగవత్పాదములని నమ్ముకొన్న
వాడికి క్షతి ఏముంది. నిరాఘాటంగా సాగుతుంది రాజ్యం. భరత రాజ్యమైనా
రామరాజ్యమే అది. అందుకే వాలికి సమాధానం చెప్పే సందర్భంలో రాముడు
ఇక్వాకూణామియంభూమిః - సశైలవనకాననా - తాంపాలయతి, ధర్మాత్మా
భరతః - నిగ్రహాను గ్రహే రతః - తస్యధర్మ కృతాదేశా వయమన్యేచపార్థివాః
భరతే ధర్మవత్సలే - పాలయత్యఖిలాం భూమిం కశ్చరేద్ధర్మ నిగ్రహమ్ - భరతాజ్ఞా
పురస్కృత్యనిగృహీమో యధావిధి ఇదంతా ఇక్ష్వాకువుల రాజ్యం. దీన్ని పాలించేవాడు
ప్రస్తుతం భరతుడు. ఆయన నిగ్రహానుగ్రహ సమర్థుడు. ఆయన పాలిస్తుంటే ధర్మాన్ని
Page 218