అన్నిటికన్నా మించిన గొప్ప గుణం భరతుడికి ధార్మికమైన దృష్టి. ధర్మం తరువాతనే అతడి కెవరైనా. పెద్దలైనా పిన్నలైనా ధర్మలోపమెవరు చేసినా సహించడు. వారిని సరిదిద్దటానికే ప్రయత్నిస్తాడు. ఈ ధర్మదీక్ష అతనికి ధైర్యమిచ్చింది. అది అతణ్ణి నిర్మముణ్ణి చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా చేసింది. అందుకే ఇతరులతణ్ణి అనుమానించినా భయపడినా అతడెప్పుడూ తొణకడు. బెణకడు. స్తిమిత గంభీరంగానే వ్యవహరిస్తాడు. అది చూచి వారే తొందరపడి అనవసరంగా ఈ మహాత్ముణ్ణి అనుమానించామే అని తమకు తామే వెనుతగ్గవలసి వస్తుంది. తప్పుపట్టిన నోటితోనే అతని గుణాలుగ్గడించవలసి వస్తుంది. గుహ భరద్వాజు-లలాగే చేశారాయన విషయంలో. మొదట అనుమానించిన వాడే తరువాత విషయమంతా తెలుసుకొని ఇలా ప్రశంసించాడు గుహుడు. ధన్యస్త్వం నత్వయాతుల్యంపశ్యామి జగతీతలే - అయత్నాదాగతం రాజ్యమ్ - యస్త్వం త్యక్తు మిహేచ్ఛసి. అప్రయత్నంగా వచ్చి వరించిన రాజ్యలక్ష్మిని త్రోసిపుచ్చావంటే ఎంత గొప్పవాడవు. నీవంటివాడు భూమండలంలో లేడంటాడు. నిజమే వాడన్నమాట. ఇవ్వనంటే వెళ్లిపోయాడు రాముడు. ఇస్తానన్నా వద్దన్నాడు భరతుడు. మరి అలాంటివాడు భూమండలంలో లేడంటే ఆశ్చర్యమేముంది. అంతటి స్వార్థత్యాగమెవరికుంది. అయోధ్యా వాసులే ఆశ్చర్యపోయారాయన నిస్స్వార్థబుద్ధికి. నీకోసమే రాజ్యం కోరానని కైక ముచ్చటగా అంటే నహిమన్యేనృశం సేత్వం - రాజధర్మమపేక్షసే. నీకు రాజనీతి తెలీదే పాపిష్టురాలా-అస్మిన్ కులేహి పూర్వేషాం జ్యేష్ఠరాజ్యేభిషేక్ష్యతే. జ్యేష్ఠుడు కాదటే రాజ్యం చేయవలసింది? అని మందలిస్తాడు. అమాత్యులంతా వచ్చి రాజ్యంగృహాణ భరత పితృపై తామహంధ్రువమ్ అని ప్రార్థిస్తే అభిషేక ద్రవ్యాలన్నిటికీ ప్రదక్షిణం చేసి అతడు జ్యేష్ఠస్యరాజతా నిత్యముచితా నైవంభవంతోహం వక్తుమర్హంతి రామః పూర్వోహినోభ్రాతా - భవిష్యతి మహీపతిః అని తెగవేసి చెబుతాడు.
ఇలాంటి నిస్స్వార్థబుద్ధితో పాటు నిగ్రహంకూడా ఉన్న మహానుభావుడతడు. శత్రుఘ్నుడు కోపంతో కుబ్జను కొప్పుపట్టి లాగుకొని వచ్చి వధించబోతుంటే అతజ్జీ నివారిస్తాడు. అదేకాదు. తల్లేకాదు. ఇద్దరు చేసిందీ మహాపరాధమే. వారిని దండించ దలిస్తే అన్న రాముడే దండించి ఉండేవాడు. ఆయనే దండించలేదంటే మన మాపని చేయుట ఏమైనా ధర్మమేనా అని హెచ్చరిస్తాడు. ధర్మదీక్షతోపాటు ఇంత నిగ్రహశీలం
Page 216