#


Index

భరత లక్షణులు

వీణ్ణి వీడితల్లిని నేను వధిస్తే నీవు సుఖంగా రాజ్యం చేయవచ్చును. అని ఎన్నెన్నో దుర్భాషలాడుతాడు.

  దానికి రాముడిచ్చిన సమాధానం చూడండి. రాజుగారి మాటమీద రాజ్యం వదలి వచ్చిన మనలను చూడటానికి వచ్చిన భరతుణ్ణి వధించి ఆ రాజ్యానికి మరలా ఆసించటమా ? నాకు భరతుడొకడు నీవొకడవు కావు. మీరందరుంటేనే నాకు రాజ్యం. లేకుంటే అది భస్మమే. మన్యేహమాగతోయోధ్యామ్ - భరతో భాతృవత్సలః మమ ప్రాణాత్ ప్రియతరః కులధర్మమనుస్మరన్ - శ్రుత్వా ప్రవ్రాజితం మాంహి - జానక్యాస హితం వీరత్వయాచ స్నేహేనాక్రాంత హృదయః శోకేనా కులితేంద్రియః ద్రష్టుమభాగ్యతో హ్యేష - భరతో నాన్యధాగతః పాపం మన మరణ్యానికి వచ్చిన తరువాత ప్రవాసం నుంచి తిరిగివచ్చి ఉంటాడు. రాగానే తెలుసుకొని ఉంటాడు నేను నీతో సీతతో అరణ్యానికి వచ్చానని. నేనంటే అతనికి ప్రాణం. దానిచే ఆ మాట భరించలేక భ్రాతృస్నేహంతో దుఃఖంతో విలపిస్తూ నన్ను చూడటానికి బయలుదేరి వచ్చాడు. తల్లిని చీవాట్లు పెట్టి తండ్రికి నచ్చచెప్పి నాకు మరలా రాజ్యం కట్టపెట్టాలని వచ్చి ఉంటాడు. మన విషయంలో ఒక కాని పని మనసులో కూడా తలపెట్టేవాడు కాడు. ఇంతకు ముందెప్పుడైనా అలా తలపెట్టాడా అతడు చెప్పు. ఎందుకిలా కర్ణకఠోరంగా మాట్లాడుతావు. అతణ్ణి అన్నావంటే అది నన్నన్నట్టే సుమా. తండ్రులను కొడుకులూ, అన్నలను తమ్ములూ చంపటమేనా పని. నీవు రాజ్యం కోసమే ఇలా మాట్లాడితే చెప్పు. భరతుడు రాగానే ఇప్పుడే చెబుతాను నా బదులు వీడికి రాజ్యమివ్వమని. నేనివ్వమంటే తప్పకుండా ఇస్తాడు భరతుడు. నీవే రాజ్యం చేతువుగాని, ఇలా మాట్లాడేసరికి మొగం చెల్లక లక్ష్మణుడు సిగ్గుతో తన శరీరంలో తానే తల దాచుకోవలసి నంతపని అయిందట.

  భరతుడి మీద రామచంద్ర ప్రభువుకెంత ప్రేమ ఎంత నమ్మకమో చూడండి. ఇలాంటి నమ్మకం పరమాత్మ కాబట్టి ఆయనకున్నదిగాని అల్పజ్ఞులైన తోడిజీవులకే లేకపోయింది. లక్ష్మణుడి వ్యవహారం చూచాముగా. ఒక లక్ష్మణుడేమిటి ? భరద్వాజుడి లాంటి తపస్సంపన్నుడైన మహర్షికే లేకపోయింది. భరతుడు వచ్చి తనకభివాదం చేయగానే గ్రహించాడతడు దశరథుడి కుమారుడని. భరతుడు తన్ను కుశలప్రశ్న వేసినా అదంతా దొంగ వినయంగా భావించాడా మహర్షి. కారణం

Page 212

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు