నాటుతున్నాయి. నాకేదో తెలియని అనుభూతి నందిస్తున్నాయి. దయచేసి నాకేదైన తరణోపాయముంటే తెలియజెప్పండని వేడుకొంటాడు.
పిమ్మట త్రికాలజ్ఞులైన ఆ మహర్షులతడొక కారణజన్ముడని తెలిసి రామ అనే అక్షరద్వయాన్ని ఉపదేశించి వెడతారు. అప్పటినుంచీ అదే ఒక తారక మంత్రంగా భక్తిశ్రద్ధలతో జపిస్తూ అలాగే కూచొని పోతాడా ఆటవికుడు. క్రమంగా వారాలు గడిచాయి. మాసాలు గడిచాయి. సంవత్సరాలు గడిచాయి. చలించలేదు. చుట్టూ ఒక పుట్ట పెరిగిపోయింది. అందులో మునిగిపోయిందాయనమూర్తి. అయినా కదలలేదు ? మెదలలేదా పంతగాడు. రామ అని కూడా కాక దాన్ని వ్యత్యయం చేసి మరా అని జపిస్తూనే ఉన్నాడు చివరదాకా. అదే మరలా రామ అనే మంత్రంగా మారి అతనిపాలిటికి తారకమయింది. సాధకుడు చివరకు సిద్ధి పొందాడు. అతడిప్పుడు మామూలు కిరాతుడు కాడు. వాల్మీకి మహర్షి రామమంత్రోపాసనా బలంతో తరువాత రామాయణ కథనే కావ్యరూపంగా గానంచేసిన మహనీయుడు.
ఇదీ లోకంలో వాల్మీకిని గురించి ప్రచారంలో ఉన్న ఐతిహ్యం. ఇది ఎంతవరకు యధార్థమో మనకు తెలియదు గాని యధార్థమే ననిపించేటంత ప్రచారం దీనికి. ఆ బాల గోపాలమందరూ చెప్పుకొంటూనే వస్తున్నారీ కథ అయితే ఇది లోకంలో ప్రచారమయినంతగా గ్రంథాలలో ఎక్కడా వినపడటంలేదు. వాల్మీకి చరిత్ర అంటూ తెలుగులో వ్రాసిన ఒకటి రెండు ప్రబంధాలలో తప్ప నిచ్చి సంస్కృత వాఙ్మయంలో ఎక్కడా ఇవి ప్రామాణికంగా ఉన్నట్టు కానరాదు. బహుశా మహాభక్తులు, యోగులు, జ్ఞానులు వీరంతా మొదట పామరులుగా దుర్మార్గులుగా బ్రతికి తరువాత జీవిత మధ్యంలో ఏదో ఒక గొప్ప సంఘటన వచ్చి పరివర్తనం చెందుతూ వచ్చినట్టు మనం తరచుగా వింటున్నాము కాబట్టి ఇదీ అలాంటి సందర్భమే అయి ఉంటుందను కోవచ్చు. శివభక్తుల చరిత్రలలో కన్నప్ప చరిత్ర చాలా వరకిలాంటిదే. "అన్యేత్వేవ మజానంతః శ్రుత్వాన్యేభ ఉపాసతే - తేపిచాతి తరంత్యేవ నిత్యమ్ శ్రుతి పరాయణాః అనే శాస్త్రవాక్యం కూడా ఇలాంటి సన్నివేశాలను సమర్థిస్తూనే ఉన్నది.
దీని కుపోద్భలకంగా మరి రెండు మూడంశాలను కూడా మనమిక్కడ చెప్పుకోవచ్చు. రామాయణ రచనోద్యమానికి వాల్మీకిని పురికొల్పిన మొట్టమొదటి ఘట్టం ఒక కిరాతుడి చర్యే. అతడు తనలాగే ఒక పక్షిని నిష్కరుణంగా వధించటం
Page 21