#


Index


కవి మాహాత్మ్యము

విస్తరించి చెప్పే ఆచార్యుడికి వ్యాసుడని పేరు. పరస్పరం కలిసిపోయి గందరగోళంగా ఉన్న వేద వాఙ్మయాన్ని మంత్ర బ్రాహ్మణగీతిరూపంగా విభజించి పురాణేతి హాసాలు సృష్టించి లోకానికి బోధించటం మూలాన వ్యాసుడు వ్యాసుడయ్యాడు. బాదరాయణుడనే వ్యాఖ్య కూడా ఆయనకు బదరికాశ్రమవాసి కావటంవల్లనే కాదు. నాకు జూడపరిపక్వమైన బదరీ ఫలంలాంటి దృష్టి కలవాడు కావటంవల్లనేనని తోస్తుంది. కరబదర సమానమన్నాడు భోజుడు. కరతలామలక మంటే ఎంతో కరబదరమన్నా అంతే. పండిన ఆమలకంలాగా పండిన బదరీఫలం కూడా పారదర్శనాని కవకాశమిస్తుంది. ఇలాంటి పారదర్శి అయిన బుద్ధిబలం కలవాడు గనుక బాదరాయణుడని పేరాయనకు సార్ధకంగా ఏర్పడి ఉండవచ్చు.

  పోతే ఆయనగారికి సమీచీనుడైన ఈ వాల్మీకికి కూడా వాల్మీకి అనే నామధేయం ఔపచారికంగా ఏర్పడిందనే నా ఊహ. వాల్మీకి అంటే వల్మీకంలో నుంచి జన్మించాడనే సామాన్యంగా లోకులు చెప్పుకునే అర్ధం. వల్మకమంటే పాము పుట్ట. పాము పుట్టలో నుంచి పుట్టటమేమిటి. దీనికొక కథ చెబుతారు లోకంలో. వాల్మీకి పుట్టుకతోనే ఋషీశ్వరుడు కాడు. పుట్టుకతో ఆయన ఒక బోయ. కిరాతకుడుగా జన్మించి కిరాత చర్యలతోనే జీవితం గడుపుతూ వచ్చాడు. విలువిద్య అలవడడంవల్ల పక్షులనూ, మృగాలనూ వేటాడేవాడు. అంతేగాక దారులు గొట్టి బాటసారులను నిర్దాక్షిణ్యంగా దోచుకొనేవాడు. వారిని చిత్రహింసలపాలు చేసేవాడు. ఒకనాడు ఆయన పురాకృత సుకృతమే ఆ రూపాలు ధరించి వచ్చిందా అన్నట్టు ఏడుగురు మహర్షులా దారిన పోతూ కనిపించారు. అత్రిభరద్వాజాదులైన సప్త మహర్షులు వారు. వెంటనే వారిపై బడి దోచుకోవాలని చూచాడా తుంటరి. అయితే వారి దగ్గర ఏముందని గోచిపాతరాయళ్లని తెలిసిపోయిందతనికి, ఏదీ ధనం ఎక్కడ దాచారని నిలదీశాడు. అనశ్వరమైన ధనమొకటి ఉండగా మాకేమి కర్మ ఈ నశ్వరమైన ధనాన్ని దాచటానికి. తెలివితక్కువవాడవు గనుక నీవిదే పరమార్ధమని పోగు చేసుకొంటున్నావు. పోగు చేస్తున్నావే గాని అది నీకేమాత్రమైనా నిలిచిందా ? అక్కరకు వచ్చిందా ? నిలిస్తే మరలా దేనికిలా తాపత్రయపడుతున్నావు. దీని వల్ల నీకనుదినమూ ప్రయాసే తప్ప ఇహమూ పరమూ లేదని హితోపదేశం చేస్తారు. ఏ ధోరణిలో ఉన్నాడో, అప్పుడా కిరాతుడయ్యా మీ మాటలు మాటలు గావు. నాకు ఈటెలలాగా అయి మనసుకు

Page 20

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు